జీ సినిమాలు ( 19th May)

Thursday,May 18,2017 - 10:04 by Z_CLU

అంతకు ముందు ఆ తరవాత

నటీ నటులు : సుమంత్ అశ్విన్, ఈషా

ఇతర నటీనటులు : మధుబాల, శ్రీనివాస్ అవసరాల, రవి బాబు, రోహిణి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ :  23 ఆగష్టు 2013

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తరవాత’ ఒక మెచ్యూర్డ్ లవ్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్, ఈషా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మధుబాల, రవిబాబులు కీలక పాత్రలు పోషించారు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకి ఎసెట్.

==============================================================================

పెద్ద మనుషులు

హీరోహీరోయిన్లు  – సుమన్, రచన, హీరా

ఇతర నటీనటులు – ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, కోటశ్రీనివాసరావు,  కైకాల సత్యనారాయణ

సంగీతం – ఈశ్వర్

దర్శకత్వం – బోయిన సుబ్బారావు

నిర్మాత – డి. రామానాయుడు

విడుదల – 1999, జనవరి 13

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పడంతో పాటు… ఆలుమగల మధ్య మాట పట్టింపులు, అనుమానాలు వస్తే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో చాటిచెప్పిన చిత్రమే పెద్ద మనుషులు. సినిమా మొత్తం సుమన్ చుట్టూనే తిరిగినప్పటికీ… పెద్దమనుషులుగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు తన నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఈ సినిమాతోనే ఈశ్వర్… సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

==============================================================================

 లక్ష్మీ రావే మా ఇంటికి

నటీనటులు : నాగశౌర్య, అవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.

==============================================================================

అనసూయ

నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

==============================================================================

 నకిలీ

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్

ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2012

విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

ధీరుడు

నటీ నటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్ డేట్ : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

=============================================================================

యల్. బి. డబ్ల్యూ

నటీనటులు : ఆసిఫ్ తాజ్, చిన్మయి

ఇతర నటీనటులు : రోహన్ గుడ్ల వల్లేటి , అభిజిత్ పుండ్ల, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనిల్ R

డైరెక్టర్ :  ప్రవీణ్ సత్తారు

ప్రొడ్యూసర్ : డెబొరా స్టన్, నవీన్ సత్తారు

రిలీజ్ డేట్ : 18 ఫిబ్రవరి 2011

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ LBW. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.