సమ్మర్ లో రిలీజ్ కానున్న నిహారిక కొత్త సినిమా

Wednesday,February 14,2018 - 02:41 by Z_CLU

‘ఒక మనసు’ సినిమాతో ఇంప్రెస్ చేసిన నిహారిక ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో రెడీ అవుతుంది. బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్  గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘హ్యాప్పీ వెడ్డింగ్’ అని  టైటిల్  ఫిక్స్ చేసిన సినిమా యూనిట్,  ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. పాకెట్ సినిమా, UV క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు.

 

పెళ్ళి ఫిక్స్ అయిన రోజు నుండి పెళ్ళయ్యే రోజు వరకు జరిగే రొమాంటిక్ జర్నీలోని హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది హ్యాప్పీ వెడ్డింగ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యేలా, న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కినట్టు తెలుస్తుంది. లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజర్.  ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.