కాజల్ యాంగిల్ లో ‘అ!’ మూవీ

Wednesday,February 14,2018 - 01:56 by Z_CLU

నాని నిర్మించిన ‘అ!’ ఈ నెల 16 న రిలీజవుతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, ట్రెండ్ సెట్టింగ్ మూవీ అనిపించుకోవడం గ్యారంటీ కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.. ఈ సందర్భంగా కాజల్ తన క్యారెక్టర్ గురించి, సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంది…

నో చెప్పే చాన్స్ లేదు ….

ప్రశాంత్ వర్మ స్టోరీ చెప్పగానే ఇమ్మీడియట్ గా చేసేయాలనిపించింది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇకపై కూడా రాదు. ఈ సినిమా సక్సెస్ అయితే మరెంతో మంది ఫిల్మ్ మేకర్స్ కొత్త కాన్సెప్ట్స్ చేయడానికి ముందుకు వస్తారు.

నాకు చాయెస్ దొరకలేదు…

ప్రశాంత్ వర్మ నాకు స్టోరీ అందరి కన్నా ముందు చెప్పాడు. అప్పటికీ స్టోరీ కంప్లీట్ గా రెడీ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే అంతా ఫిక్స్ అయ్యాక కలిశాడో, అప్పటికే తక్కిన కాస్టింగ్ అయిపోయింది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ అమేజింగ్ గా ఉంటుంది. నాకు ముందే తెలిసి ఉంటే, నిత్య… రెజీనా… ఈషా.. చేసిన ఏదో క్యారెక్టర్ ని రిక్వెస్ట్ చేసుకుని ఉండేదాన్ని. నాకు చాయెస్ లేకుండా పోయింది. కానీ నేను చేసిన క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం…

 

మేకప్ కూడా లేదు….

‘అ!’ జెన్యూన్ స్టోరీ. తక్కిన క్యారెక్టర్స్ కి మేకప్ ఉన్నా, అవి వాటి లుక్స్ ణ్ బట్టి ఉంటుంది. సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రశాంత్ వర్మ అందరి లుక్స్ బుక్ లో డిజైన్ చేసి పెట్టుకున్నాడు. కాస్ట్యూమ్స్ ఫ్యాబ్రిక్ తో సహా… నా క్యారెక్టర్ కి అసలు మేకప్ అవసరం లేదు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం రేర్ థింగ్…

షాక్ తింటారు…

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. థ్రిల్ అవుతారు. కానీ కంపల్సరీగా షాక్ అవుతారు. అ! సినిమా షాక్ వ్యాల్యూ సినిమా.

ఐదు రోజుల్లో…

ప్రశాంత్ వర్మ బిగినింగ్ నుండి చాలా క్లారిటీతో ఉన్నాడు. నా క్యారెక్టర్ షూటింగ్ జస్ట్ 5 డేస్ లో కంప్లీట్ చేశాడు.

 

సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్…

సినిమాకి కథ బ్యాక్ బోన్ అయితే మరో బిగ్గెస్ట్ ఎసెట్ కాస్టింగ్. సినిమాలో ప్రతి ఒక్కరు సరిగ్గా మ్యాచ్ అయ్యారు. ప్రతి క్యారెక్టర్ ని ఎక్స్ ట్రీమ్ లెవెల్లో డెలివర్ చేశారు.

రియల్ ఇన్సిడెంట్స్….

అ! సినిమా కంప్లీట్ గా ఫిక్షన్ కాదు. ఒక ఇన్సిడెంట్ నుండి ఇన్స్ పైర్ అయిన స్టోరీ.