సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ
Friday,July 27,2018 - 07:16 by Z_CLU
సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో బ్యూటిఫుల్ లవ్ & ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు సుమంత్ అశ్విన్. అవి మీకోసం…
ఈ సినిమా నాకో మంచి ప్లాట్ ఫామ్…
నాకింకా చాలా సినిమాలు చేయాలని ఉంది. మంచి డైరెక్టర్స్ తో ప్రొడక్షన్ హౌజెస్ తో పని చేయాలని ఉంది. ఈ సినిమా నా కరియర్ కి మంచ్ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేస్తుందనుకుంటున్నా…
అలా ఉంటుంది…
సెకండాఫ్ లో లాస్ట్ 20 మినిట్స్ లో ఉండే సీన్స్ ఎన్నిసార్లు చూసినా, చూడాలనిపిస్తుంది. అంతలా కనెక్ట్ అయిపోతారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. సినిమా సక్సెస్ గ్యారంటీ అనిపిస్తుంది.
డిఫెరెంట్ కథ…
ఒక పెళ్ళి జరిగే సిచ్యువేషన్ లో అటు అమ్మాయి ఫ్యామిలీలో, ఇటు అబ్బాయి ఫ్యామిలీ జరిగే సిచ్యువేషన్స్, ఇమోషనల్ మూమెంట్స్ ప్రతీది సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు న్యాచురల్ గా అనిపిస్తాయి.

అదే నా రోల్…
సినిమాలో నేను పక్కా విజయవాడ అబ్బాయిలా కనిపిస్తాను. ఒక ఆడ్ ఏజెన్సీలో ఆడ్స్ కి జింగిల్స్ రాస్తుంటా…
అదీ తెలుసుకున్నాను…
మనం పెళ్ళి అనగానే కళ్ళ ముందు కనిపించే హడావిడి ఒక్కటే చూస్తుంటాం. కానీ అది ఓ రెండు కుటుంబాల ఇమోషనల్ జర్నీ.. ఆ విషయం ఈ సినిమా వల్లే తెలుసుకోగలిగాను.
ప్రీ క్లైమాక్స్…
సినిమాలో ఒక ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఒక 15 నిమిషాల సీన్ ఉంటుంది. ఈ సినిమాకి నేను కనెక్ట్ అయిన మెయిన్ ఫ్యాక్టర్ అదే. కంప్లీట్ సినిమా కామెడీ తో, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో రన్ అయినప్పటికీ ఈ 15 నిమిషాలు సినిమాకి కీలకం.
అదీ నిహారిక…
నిహారిక చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. తను సెట్స్ లో ఉన్నప్పుడు చాలా ఫన్ ఉంటుంది.
నో కాంప్రమైజ్…
UV క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేసినందుకు చాలా హ్యాప్పీగా ఉంది. సాహో సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారో, ఈ సినిమాను కూడా అలాగే ట్రీట్ చేశారు. ఏది అడిగితే అదీ బెస్ట్ ఇచ్చారు.

ప్రపంచం మారిపోతుంది…
పెళ్లిపై అభిప్రాయమేంటని అడిగితే సడెన్ గా చెప్పలేను. ఇప్పుడు ఎవరితోనైనా లవ్ లో పడితే ఇమ్మీడియట్ గా పెళ్ళి చేసేసుకోవాలనిపిస్తుంది. అదే ఏమీ లేకపోతే ఇంకా టైముందనిపిస్తుంది. నా విషయంలో కూడా అంతే ఇంకా ఎవరూ లేరు కాబట్టి.. నాకింకా టైముంది.
ప్రేమకథా చిత్రం – 2
నెక్స్ట్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. వర్కింగ్ టైటిల్ ప్రేమకథా చిత్రం – 2. ఇంకా ఫైనల్ చేయలేదు. ఇది కంప్లీట్ గా డిఫెరెంట్ స్టోరీ. డైరెక్టర్ హరికి ఇది ఫస్ట్ మూవీ.
బయటికి రావాలనుకుంటున్నాను…
స్టీరియో టైప్ మూవీస్… లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటికి రావాలనుకుంటున్నాను. విలన్ రోల్స్ అయినా కొత్తగా అనిపిస్తే చేయడానికి రెడీ.