లక్ష్మణ్ కార్య హ్యాపీ వెడ్డింగ్ ఇంటర్వ్యూ

Friday,July 27,2018 - 04:33 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ సినిమా గురించి ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు. ఆ విషయాలు మీకోసం… 

కరియర్ బిగినింగ్…

సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ నారోజు గారు నా షార్ట్ ఫిల్మ్ చూసి, ‘మొగుడు’ సినిమాకి అసిస్టెంట్ కెమెరా మెన్ గా జాయిన్ అవ్వమన్నారు. ఆ తరవాత మళ్ళీ ఆయనే దేవకట్ట గారికి ఇంట్రడ్యూస్ చేశారు. అలా నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. సినిమా చివరకి వచ్చేసరికి కో డైరెక్టర్ అయిపోయా.. ఆ ఎక్స్ పీరియన్స్ మరవలేనిది.

దీనికన్నా ముందు…  

దీనికన్నా ముందు ‘ఎందుకిలా’ వెబ్ సిరీస్ చేశాను. ఈ సిరీస్ లో సుమంత్ అశ్విన్ హీరోగా చేశారు. అలా ఆయనతో కనెక్ట్ అయ్యాను. ఆ వెబ్ సిరీస్ సక్సెస్ తరవాత ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్.

అలా జరిగింది…

వెబ్ సిరీస్ తరవాత ఫీచర్ మూవీ అనుకున్నప్పటి నుండే సుమంత్ అశ్విన్ గారితో కలిసి స్టోరీ డిస్కర్షన్స్, చేంజెస్ చేసుకుంటూ స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నాను. ఇక హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నప్పుడు నా వైఫ్, ‘నిహారిక’ అయితే బావుంటుంది అని సజెస్ట్ చేసింది.

అపుడు నిహారిక…

నిహారికని కలిసి స్టోరీ చెప్పేవరకు అసలు తను స్టోరీ వింటుందో లేదో అనుకున్నా… ఎందుకంటే ఫస్ట్ మూవీ తరవాత నిహారిక ఏ స్టోరీ ఆక్సెప్ట్ చేయట్లేదు అని విని ఉన్నా… అయినా చెప్దామని వెళ్ళా.. ఫస్ట్ హాఫ్  వినగానే తను స్టోరీకి కనెక్ట్ అయిపోయింది. సెకండాఫ్ తరవాత ఎగ్జైటెడ్ అయిందనిపించింది. అయినా ఒకరోజు టైమ్  ఇవ్వమని చెప్పి నెక్స్ట్ డే కన్ఫమ్ చేసింది.

అదే హ్యాప్పీ వెడ్డింగ్…

అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు… అబ్బాయిలు బిజీగా ఉండి వాళ్ళ ఫోన్ ఇగ్నోర్ చేయొచ్చు… దాన్ని అంతే ఈజీగా మర్చిపోవచ్చు కానీ అమ్మాయిలూ ఆ చిన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు.. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ తో తెరకెక్కిందే హ్యాపీ వెడ్డింగ్.

ఆ సీన్ హైలైట్…

నిహారిక, మురళీ శర్మ గారి కాంబినేషన్ లో ఉండే ఒక సీన్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది. మురళీ శర్మ గారు కూడా ఆ సీన్ విన్నాకే ఓకె అనేశారు.

మ్యూజిక్ డైరెక్టర్…

శక్తికాంత్ గారికి స్టోరీ చెప్పగానే ఓకె చెప్పేశారు. ఇలాంటి లవ్ సబ్జెక్ట్ కి ఆయన దగ్గరే అప్పటికే ట్యూన్స్ ఉన్నాయి. కానీ నేను ట్యూన్స్ డిఫెరెంట్ గా ఉండాలి అని చెప్పా.. మ్యూజిక్ విషయంలో నేను చాలా హ్యాప్పీ…

ముగ్గురం కలిస్తే రచ్చే…

నిహారికకి అసలు నేను మెగాఫ్యామిలీ అనే ఫీలింగే ఉండదు. చాలా బాగా కలిసిపోతుంది. నేను, సుమంత్ అశ్విన్, నిహారిక కలిశామంటే రచ్చే.

నమ్మకంగా ఉన్నాం…

ఇప్పటి వరకు చేసిన ప్రమోషనల్ టూర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేమందరం సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

M.S. రాజు గారి వల్లే…

ఈ సినిమాకి రీజన్ M.S. గారి వల్లే. ఆయన జడ్జిమెంట్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇంత గ్రాండ్ గా రిలీజవుతుంది. ఆయన సినిమా చూసి ‘మనసంతా నువ్వే’ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్, ఈ సినిమా చూసినప్పుడు కలుగుతుంది అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్.

అదీ హ్యాపీ వెడ్డింగ్…

ఈ సినిమాలోని క్యారెక్టర్స్ తో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. హ్యాపీ వెడ్డింగ్ అంతలా మెస్మరైజ్ చేస్తుంది.