జులై 27న "హ్యాపి వెడ్డింగ్ " గ్రాండ్ రిలీజ్

Sunday,July 01,2018 - 01:13 by Z_CLU

సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ దర్శకుడు.  సంగీతం- శక్తికాంత్, రీరికార్డింగ్‌- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. జులై 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

నిహారిక మాట్లాడుతూ “యువి క్రియేష‌న్స్ లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ల‌క్ష్మ‌ణ్ చాలా బాగా తెర‌కెక్కించారు. ప్ర‌తి పాత్రా మెప్పిస్తుంది. సినిమా మొత్తం ప్లెజెంట్‌గా ఉంటుంది.“ అని అన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “యువీ క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. నీహారిక‌తో న‌టించ‌డం మంచి ఎక్స్ పీరియ‌న్స్. “ అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగే రోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌నితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. “ అని అన్నారు..

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు..

యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
మ్యూజిక్ డైరెక్టర్ – శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ – ఎస్. ఎస్. తమన్
కెమెరా – బాల్ రెడ్డి
మ్యూజిక్ – శ‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌ – పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌