నా కరియర్ లోనే బెస్ట్ మూవీ – పూరి జగన్నాథ్

Wednesday,February 14,2018 - 03:50 by Z_CLU

రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మెహబూబా’ టీజర్ యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. పూరి ఆకాష్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇండో – పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. తన కరియర్ లోనే ఫస్ట్  టైమ్ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ ని తెరకెక్కిస్తున్న పూరి జగన్నాథ్, విజువల్స్ విషయంలో ఈ సినిమా తన కరియర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పుకున్నాడు.

ఏప్రియల్ లో సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న పూరి జగన్నాథ్ మార్చి లో ఆడియో రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్స్, సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పూరి, ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ డెలివర్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కింది.