నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్' హైలెట్స్

Friday,July 27,2018 - 02:47 by Z_CLU

మరికొన్ని గంటల్లో నిహారిక ‘హ్యాపి వెడ్డింగ్’ థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా మ్యాగ్జిమం యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ లో హైలెట్ కానున్న ఎలిమెంట్స్ ఇవే.

స్టోరీలైన్ : హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సినిమా స్టోరీలైన్. సినిమా ఎలా ఉండబోతుందన్నది ట్రైలర్ లోనే ఎలివేట్ చేశారు ఫిల్మ్ మేకర్స్. దాంతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆల్రెడీ ఈ సినిమాకి కనెక్ట్ అయిపోయారు. ఏ మాత్రం ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లేకుండా, న్యాచురల్ ఎలిమెంట్స్ తెరకెక్కిన ఈ సినిమా స్టోరీలైన్ డెఫ్ఫినేట్ గా సినిమాలో హైలెట్ కానుంది.

మ్యూజిక్ : హ్యాపీ వెడ్డింగ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఆ ఇంపాక్ట్ సినిమా సక్సెస్ పై ఏ రేంజ్ లో పడనుందో తెలిసిపోతుంది. స్పెషల్ గా ‘చలువ చెంగల్వ’ అనే సాంగ్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందోనన్న క్యూరియాసిటీ ఆడియెన్స్ లో క్రియేట్ అయి ఉంది.

నిహారిక : ఈ సినిమాకి నిహారిక ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ప్రమోషన్స్ వరకు ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. హ్యాపీ వెడ్డింగ్ కథ మొత్తం నిహారిక చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ :  UV క్రియేషన్స్ బ్యానర్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి డెఫ్ఫినేట్ గా బిగ్గెస్ట్ ఎసెట్. టెక్నీషియన్స్ దగ్గరి నుండి సినిమాలో కీ రోల్స్ ప్లే చేసిన సీనియర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఎలిమెంట్ సినిమాకి మరింత లుక్ ని తీసుకువస్తున్నాయి.

లక్ష్మణ్ కార్య : దర్శకుడికి ఇది ఫస్ట్ సినిమానే అయినా గతంలో షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో సినిమాని ప్లెజెంట్ గా ప్రెజెంట్  చేసినట్టే అనిపిస్తుంది. మరీ హడావిడి చేసే భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని చూజ్ చేసుకోకుండా హార్ట్ టచింగ్ ఇమోషనల్ కాన్సెప్ట్ ని ఎంచుకున్న దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న లక్ష్మణ్ కార్య, ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ అనిపించుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది.