గ్రాండ్ గా రిలీజైన బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’

Friday,July 27,2018 - 12:09 by Z_CLU

హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది ‘సాక్ష్యం’ సినిమా. భారీ బడ్జెట్ తో నెవర్ సీన్ బిఫోర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పుడే సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. పంచభూతాల నేపథ్యంలో ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తుంది.

శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. కాన్సెప్ట్ పంచభూతాల నేపథ్యంలోనే ఉన్నా, ఆడియెన్స్ పల్స్ తెలిసిన ఫిల్మ్ మేకర్స్, అటు లవ్ ఎలిమెంట్స్ నుండి బిగిన్ అయితే ఫ్యామిలీ ఇమోషనల్ సీక్వెన్సెస్ వరకు ప్రతీది కనెక్ట్ అయ్యేలా ఎలివేట్ చేయడం, ‘సాక్ష్యం’ సినిమాను సక్సెస్ ట్రాక్ పై నిలబెడుతుంది.

ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అబిషేక్ నామా నిర్మించాడు. హర్షవర్ధన్ మ్యూజిక్ కంపోజర్. సినిమా ప్రమోషన్స్ లో ఫిల్మ్ మేకర్స్ మెన్షన్ చేసినట్టు పీటర్ హెయిన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హైలెట్ గా నిలుస్తున్నాయి.