నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ

Tuesday,January 29,2019 - 05:24 by Z_CLU

తెలుగులో ఇది సెకండ్ మూవీనే అయినా, ఇమోషనల్ సీక్వెన్సెస్ లో ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్ లా పర్ఫామ్ చేసింది నిధి అగర్వాల్ ‘మిస్టర్ మజ్ను’ లో.  ఈ సందర్భంగా మరింత కాన్ఫిడెంట్ గా మీడియాతో తన మనసులోని మాటలు చెప్పుకుంది నిధి. అవి మీకోసం…

సంతృప్తినిచ్చింది…

‘మజ్ను’ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాప్పీగా ఉంది. చాలా సంతృప్తినిచ్చింది సినిమా.

ఇద్దరూ ఇద్దరే…

నాగ చైతన్య, అఖిల్.. ఇద్దరితోనూ పని చేసే అవకాశం నిజంగా అదృష్టంగా ఫీలవుతున్నా. అసలు ఇద్దరికీ ఎందులోనూ పోలిక ఉండదు. ఒకరు నీరైతే ఇంకొకరు నిప్పు అన్నంత తేడా ఉంటుంది ఇద్దరిలో. కానీ ఇద్దరూ చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు.

సినిమాలోని ఇమోషనల్ సీన్స్…

సినిమాలోని ఇమోషనల్ సీన్స్ లో నా పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వస్తుంది. స్క్రిప్ట్ విన్నప్పుడే తెలుసు. కొన్ని సీన్స్ టఫ్ గా ఉండబోతున్నాయని.

పక్కా హైదరాబాదీ…

నేను పుట్టింది హైదరాబాద్ లోనే కాబట్టి నాకు తెలుగు మాట్లాడటం అంత కష్టంగా లేదు. ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో కొత్తగా వింటున్న లాంగ్వేజ్ లా నాకు అనిపించలేదు.

అలాంటి సినిమా చేయలేదు…

నా ఫేస్ కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే నాకు రోల్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఈ ఫేజ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా. డ్యాన్స్ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఉంది.

రోల్స్ ఎంచుకోవడం…

ఇదే నా కరియర్ బిగినింగ్ కాబట్టి ఇంకా నేను నాకు నచ్చిన రోల్సే చేసే స్టేజ్ కి వచ్చానని అనుకోవట్లేదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత, డిఫెరెంట్ రోల్స్ పై దృష్టి పెడతా.

అదే బెస్ట్ కాంప్లిమెంట్…

‘మజ్ను’ లో నా పర్ఫామెన్స్ చూశాక, మా పేరెంట్స్ ‘నువ్వింత బాగా యాక్ట్ చేస్తావా..? అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు’ అన్నారు. అది నా లైఫ్ లో బెస్ట్ కాంప్లిమెంట్.

ఇస్మార్ట్ శంకర్ లో…

పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో నటిస్తున్నందుకు చాలా హ్యాప్పీ. ఆ రోల్ గురించి డిస్కస్ చేయడం ఇప్పుడే కరెక్ట్ కాదేమో. కానీ చాలా కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నా.

కొత్త సినిమాలు…

ఆఫర్స్ వస్తున్నాయి కానీ తొందరపడదలుచుకోలేదు. ఇప్పటి వరకు జస్ట్ ‘మిస్టర్ మజ్ను’ పైనే  ఫోకస్ పెట్టాను. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’. బెస్ట్ అనిపించినదే చేద్దామనుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేద్దామనుకుంటున్నాను.

నెగెటివ్ కామెంట్స్…

నెగెటివ్ కామెంట్స్ ని కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటా. కానీ ఆ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనేది మాత్రం డెఫ్ఫినెట్ గా మ్యాటర్స్. కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ పర్సన్స్ నుండి వచ్చిన కామెంట్స్ నే పట్టించుకుంటా. ‘మిస్టర్ మజ్ను’ కి మాత్రం 95% పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. ఇంకా ఏం కావాలి.

అర్జున్ రెడ్డి లో…

‘అర్జున్ రెడ్డి’ సినిమా 4 సార్లు చూశాను. ఒకవేళ అవకాశం దొరికితే ఆ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ రోల్ లో నటించాలని ఉంది.