‘నిధి అగర్వాల్’ – స్పెషల్ ఇంట్రెస్ట్...

Tuesday,July 23,2019 - 12:02 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్ కి ముందు చేసిన సినిమాలు అక్కినేని హీరోలతోనే… కానీ ఈ సినిమాల్లోనూ ఇస్మార్ట్ శంకర్  స్థాయిలో మాస్ డోస్ లేదు. అందుకే ఇస్మార్ట్ శంకర్’ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకుంది నిధి అగర్వాల్. అనుకున్నట్టే సినిమా సక్సెస్ అవ్వడంతో చిన్నగా తన డ్రీమ్ రోల్స్ వెదుక్కునే పనిలో పడింది.

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోయిన్ అనిపించుకున్న నిధి అగర్వాల్ ఫోకస్ ఇప్పుడు రొమాంటిక్ సినిమాలపై పడింది. యూత్ కి దగ్గరవ్వడానికి ఇదే బెస్ట్ స్ట్రాటజీ అనుకుందేమో తెలీదు కానీ, రొమాంటిక్ సినిమాల్లో నటించడమంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని కూడా చెప్పుకుంది. అంతేకాదు.. ఇకనుండి తను చేయబోయే సినిమాలతో  మరో అడుగు ముందు వేయనుంది.

ఇప్పటి వరకు తన సినిమాకు డబ్బింగ్ చెప్పుకోలేదు నిధి. ఇకపై సినిమాలు డబ్బింగ్ కూడా చెప్పుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇస్మార్ట్ శంకర్ తరవాతే ఏ సినిమా అయినా ఫిక్సవ్వాలని వచ్చిన అవకాశాలను హోల్డ్ లో పెట్టిన నిధి, ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాల్లోంచి బెస్ట్ ని ఎంచుకునే ప్రాసెస్ లో ఉంది. 

చూడాలి మరీ.. నిధి అగర్వాల్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ వరిస్తాయో.. లేకపోతే ఇస్మార్ట్ శంకర్ తరహాలో మాస్ ఎంటర్ టైనర్స్ లో నటించే అవకాశాలు వస్తాయో… అల్టిమేట్ గా నిధి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో…