జీ సినిమాలు ( 14th ఫిబ్రవరి)

Thursday,February 13,2020 - 10:05 by Z_CLU

లవర్స్

నటీనటులు : సుమంత్ అశ్విన్నందిత

ఇతర నటీనటులు : తేజస్వి మాడివాడచాందినిషామిలి అగర్వాల్సప్తగిరిసాయి కుమార్ పంపన, MS నారాయణదువ్వాసి మోహన్ & అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : జీవన్ బాబు

డైరెక్టర్ : హరినాథ్

ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగస్వామి & B. మహేంద్ర బాబు

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2014

గర్ల్ ఫ్రెండ్ కోసం ఆరాటపడుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేసే సిద్దూ ఎఫర్ట్స్ చిత్ర వల్ల స్పాయిల్ అయిపోతాయి. అప్పటి వరకు తనను ఒక్కసారి కూడా చూడని సిద్దుఫోన్ లోనే చిత్రతో గొడవ పడతాడు. మరో వైపు ఇంకో అమ్మాయితో సిన్సియర్ గా లవ్ లో పడతాడు. ఆ తరవాత ఏం జరిగిందనేది ప్రధాన కథాంశం.

__________________________________________

ఏ మాయ చేసావే

నటీనటులు : నాగ చైతన్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : కృష్ణుడు, దేవన్, సుధీర్ బాబు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్

రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2010

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య కరియర్ ట్రాక్ నే మార్చేసింది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సమంతా, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. అంత ఇంపాక్ట్ ని చూపించింది ఈ సినిమా. అతి సాధారణ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. A.R. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

__________________________________________________

రారండోయ్ వేడుక చూద్దాం

నటీనటులు : అక్కినేని నాగచైతన్యరకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబుసంపత్ రాజ్వెన్నెల కిషోర్పోసాని కృష్ణ మురళిపృథ్విరాజ్చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017

పల్లెటూరిలో  పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని  గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆదికృష్ణ కి ఏమవుతాడు..వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ  కలిశారా లేదా అనేది స్టోరి.

____________________________________________________

హలో

నటీనటులు : అఖిల్ అక్కినేనికళ్యాణి ప్రియదర్శన్

ఇతర నటీనటులు : జగపతి బాబురమ్యకృష్ణఅజయ్సత్య కృష్ణన్అనీష్ కురువిల్ల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : విక్రమ్ కుమార్

ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017 

చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీనుజున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరుఅవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

__________________________________________________

నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు

సంగీతం  : థమన్

ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ

నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి

నిడివి : 145 నిమిషాలు

విడుదల తేది : 25 జనవరి , 2019

లండన్ లో చదువుకునే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్) నిత్యం అమ్మాయిలను తన మాయలో పడేస్తూ వారిని ఆనందంగా ఉంచుతుంటాడు.  అదే లండన్ లో అబద్దాలు చెప్పకుండా తనని  మాత్రమే ప్రేమించే అబ్బాయి కోసం ఎదురుచూస్తోంటుంది నిఖిత(నిధి అగర్వాల్). అనుకోకుండా వీరిద్దరూ లండన్ లో పరిచయమవుతారు. విక్కి ప్లే బాయ్ క్యారెక్టర్ చూసి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది నిఖిత.. ఈ క్రమంలో ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరికీ విక్కీ చెల్లికి , నిఖిత అన్నయ్య కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది.

 అయితే విక్కీ తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , తండ్రిపై అతనికున్న గౌరవం, దగ్గరైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకొని అతనితో ప్రేమలో పడిపోతుంది నిఖిత. అయితే ప్రేమ అనేది జస్ట్ నెలకే పరిమితం అనే ఫీలింగ్ లో ఉంటూ పెళ్ళికి దూరంగా ఉండే విక్కీ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది నిఖిత. అతనికి ఇష్టం లేకపోవడంతో ఓ రెండు నెలలు తనను ప్రేమించాలని, ఆ తర్వాత ఇష్టం కలిగితే పెళ్లి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటుంది నిఖిత. అక్కడి నుండి అసలు కథ మొదలవుతోంది. అలా నిఖిత ఒప్పందానికి లాక్ అయిన విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. చివరికి విక్కీ-నిఖిత ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

________________________________________

స్టూడెంట్ నం 1

నటీనటులు : N.T.R., గజాల

ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : S.S. రాజమౌళి

ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు

రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001

ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..? తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.