జీ సినిమాలు (12th డిసెంబర్)

Friday,December 11,2020 - 10:04 by Z_CLU

crime-23-movie-క్రైమ్-23

క్రైమ్ 23

నటీనటులు – అరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ, తంబీ రామయ్య
దర్శకుడు – అరవగన్ వెంకటాచలం
బ్యానర్ – శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్
నిర్మాత – ప్రసాద్ ధర్మిరెడ్డి
సంగీతం – విశాల్ చంద్రశేఖరన్
రిలీజ్ డేట్ – ఆగస్ట్ 31, 2018

కంప్లీట్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఫీల్ కావాలంటే CRIME 23 మూవీ చూడాల్సిందే. చర్చి ఫాదర్, ప్రెగ్నెంట్ జెస్సిక అనుమానాస్పద హత్యలతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిటీ అసిస్టెంట్ కమిషనర్ అయినా అరుణ్ విజయ్ రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ఈ హత్యలు మెడికల్ మాఫియా తో సంభంధం ఉందని తెలుసుకుంటాడు విజయ్. అసలు ఈ మెడికల్ మాఫియా ఎవరిది? ఎందుకుప్రెగ్నెంట్ లేడీస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ? ఇలా ఎన్నో మలుపులు, ఇంకెంతో ఉత్కంఠ మధ్య సాగుతుంది క్రైమ్ 23 మూవీ.

___________________________________________

సంతోషం

నటీనటులు – నాగార్జున, శ్రియ, ప్రభుదేవా, గ్రేసీసింగ్, సునీల్ తదితరులు
సంగీతం – ఆర్పీ పట్నాయక్
దర్శకత్వం – దశరథ్
బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత – కేఎల్ నారాయణ
రిలీజ్ – 2002, మే 9

నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి సంతోషం. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, కింగ్ నాగ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. హార్ట్ టచింగ్ స్టోరీని దర్శకుడు దశరథ్, అంతే హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు. హీరోయిన్ గ్రేసీ సింగ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక మరో హీరోయిన్ శ్రియ, ఎప్పట్లానే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. థీమ్ సాంగ్ తో కలిపి మళ్లీ మళ్లీ హమ్ చేసుకునేలా మొత్తం 8 ట్యూన్స్ ఇచ్చాడు ఆర్పీ పట్నాయక్.

__________________________________________

మగువలు మాత్రమే 

నటీ నటులు : జ్యోతిక , ఊర్వసి , నాజర్, భాను ప్రియ , శరణ్య పోన్వన్నం

ఛాయాగ్రహణం : మణికందన్

సంగీతం : జిబ్రాన్

నిర్మాత : సూర్య

దర్శకత్వం : బ్రహ్మ

విడుదల : 12 సెప్టెంబర్ 2020

జ్యోతిక ప్రధాన పాత్రలో మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల్ని తెర‌పైన చూపిస్తూ, వాటికో పరిష్కారం చెప్పే ప్ర‌య‌త్నం ‘మగువలు మాత్రమే’.  మంచి కథనంతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను సూర్య నిర్మించారు. బ్రహ్మ దర్శకత్వం వహించిన జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

___________________________________

బ్రదర్ ఆఫ్ బొమ్మాలి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : చిన్ని కృష్ణ
ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి
రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

_________________________________

రోబో 2.O

నటీనటులు : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్
రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.శంకర్
విడుదల : 29 నవంబర్ 2018

450 వందల కోట్ల బడ్జెట్ … 3D టెక్నాలజీ , రోబో కి సీక్వెల్ , సూపర్ స్టార్ రజినీ కాంత్-శంకర్ కాంబో.. ఇవన్నీ కలిసి 2.Oను క్రేజీ ప్రాజెక్టుగా మార్చేశాయి. కథ విషయానికొస్తే.. నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. ఫోన్స్ ఎలా మాయమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. సరిగ్గా అప్పుడే డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి ఈ సమస్య ను ఎదుర్కోవాలంటే మనకి చిట్టి రోబో(రజినీ కాంత్) ఒక్కటే మార్గమని మళ్లీ చిట్టి కి ప్రాణం పోస్తాడు. సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నది పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌) అని తెలుసుకున్న ఆ శక్తి ని చిట్టి ఎలా ఎదురించింది ? అసలు పక్షి రాజా ఎవరు.. అతని కథేంటి.. సెల్ ఫోన్స్ వాడుతున్న వారిపై ఎందుకు ఎటాక్ చేస్తుంటాడు.. అనేది ‘2.O’.

_________________________________________

మిస్టర్ మజ్ను

నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు
సంగీతం : థమన్
ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిడివి : 145 నిమిషాలు
విడుదల తేది : 25 జనవరి , 2019

లండన్ లో చదువుకునే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్) నిత్యం అమ్మాయిలను తన మాయలో పడేస్తూ వారిని ఆనందంగా ఉంచుతుంటాడు. అదే లండన్ లో అబద్దాలు చెప్పకుండా తనని మాత్రమే ప్రేమించే అబ్బాయి కోసం ఎదురుచూస్తోంటుంది నిఖిత(నిధి అగర్వాల్). అనుకోకుండా వీరిద్దరూ లండన్ లో పరిచయమవుతారు. విక్కి ప్లే బాయ్ క్యారెక్టర్ చూసి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది నిఖిత.. ఈ క్రమంలో ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరికీ విక్కీ చెల్లికి , నిఖిత అన్నయ్య కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది.
అయితే విక్కీ తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , తండ్రిపై అతనికున్న గౌరవం, దగ్గరైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకొని అతనితో ప్రేమలో పడిపోతుంది నిఖిత. అయితే ప్రేమ అనేది జస్ట్ నెలకే పరిమితం అనే ఫీలింగ్ లో ఉంటూ పెళ్ళికి దూరంగా ఉండే విక్కీ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది నిఖిత. అతనికి ఇష్టం లేకపోవడంతో ఓ రెండు నెలలు తనను ప్రేమించాలని, ఆ తర్వాత ఇష్టం కలిగితే పెళ్లి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటుంది నిఖిత. అక్కడి నుండి అసలు కథ మొదలవుతోంది. అలా నిఖిత ఒప్పందానికి లాక్ అయిన విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. చివరికి విక్కీ-నిఖిత ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.