జీ సినిమాలు ( 30th జనవరి )

Tuesday,January 29,2019 - 10:06 by Z_CLU

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

అదిరిందయ్యా చంద్రం

నటీనటులు  – శివాజీ, లయ

ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ

డైరెక్టర్  శ్రీనివాసరెడ్డి

రిలీజ్ డేట్  – 2005, ఆగస్ట్ 20

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

==============================================================================

వసంతం  

నటీనటులు వెంకటేష్ఆర్తి అగర్వాల్కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్ఆకాష్సునీల్చంద్ర మోహన్తనికెళ్ళ భరణిధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికిప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

కథానాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

==============================================================================

బ్రాండ్ బాబు 

నటీనటులు : సుమంత్ శైలేంద్రఈషా రెబ్బ
ఇతర నటీనటులు : పూజిత పున్నాడమురళీ శర్మరాజా రవీంద్రసత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : J.B.
డైరెక్టర్ : ప్రభాకర్ P.
ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు
రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018
వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.
అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొనిఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

రంగుల రాట్నం
నటీనటులు : రాజ్ తరుణ్శుక్లా
ఇతర నటీనటులు : సితారప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ : శ్రీరంజని
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017
ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార) తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని అమ్మతో చెప్పి కీర్తికి చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో విష్ణుకి దగ్గరవుతుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.