రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రేలర్ రిలీజయింది

Friday,June 23,2017 - 12:49 by Z_CLU

రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ థియేట్రికల్  ట్రేలర్ రిలీజయింది. గతంలో రిలీజైన టీజర్ కి ఎక్స్ టెండెడ్ వర్షన్ లా ఉన్న ఈ ట్రేలర్ మరింత ఎట్రాక్ట్ చేస్తుంది. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రానా, కాజల్ అగర్వాల్ పర్ ఫెక్ట్ ఆన్ స్క్రీన్ అనిపిస్తున్నారు. 1:20 నిమిషాల ట్రేలర్ లో సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో పెద్దగా ఎలివేట్ కాలేదు కానీ పవర్ ప్యాక్డ్ పొలిటికల్ థ్రిల్లర్ అన్న క్లారిటీ వచ్చేసింది.

సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి కాజల్ అగర్వాల్ తో పాటు కేథరిన్ తెరిసా కూడా నటిస్తుందగానే రొటీన్ గా సెకండ్ హీరోయిన్ అనుకుని ఫిక్స్ అయినవారికి ఈ ట్రేలర్  చిన్న సైజు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎగ్జాక్ట్ గా తన క్యారెక్టర్ ఏంటో గెస్ చేయడం కష్టమే కానీ కేథరిన్ క్యారెక్టర్ మాత్రం ఏ మాత్రం రెగ్యులర్ క్యారెక్టర్ కాదని ఈజీగా అర్థమైపోతుంది.