ప్రభాస్ సాహో అప్ డేట్స్

Friday,June 23,2017 - 02:34 by Z_CLU

రీసెంట్ గా హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సాహో సినిమా యూనిట్, సెకండ్ షెడ్యూల్ కి ప్రిపేర్ అవుతుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం దుబాయ్ లోని ‘అబూదాబి’ తో పాటు, యూరోపియన్ సిటీస్ లోని కొన్ని రేర్ లొకేషన్స్ ని పిక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు సినిమాలో మేజర్ హైలెట్ స్పేస్ ని ఆక్యుపై చేయబోయే మరో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ‘బుర్జ్ ఖలీఫా’ ని ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్. గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హాలీవుడ్ సినిమాలు ‘ఘోస్ట్ ప్రోటోకాల్’, ‘మిషన్ ఇంపాసిబుల్’ లాంటి సినిమాలను కూడా ఈ లొకేషన్స్ లలో తెరకెక్కించారు.

 

UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు.