గ్రాండ్ గా రిలీజయిన DJ

Friday,June 23,2017 - 12:19 by Z_CLU

అల్లు అర్జున్ DJ గ్రాండ్ గా రిలీజయింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా  రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినపుడే వరల్డ్ వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బన్ని కరియర్ లోనే ఫస్ట్ టైమ్ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించడం, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, దిల్ రాజు మైల్ స్టోన్ మూవీ అవ్వడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్నీ స్పెషాలిటీస్ తో హై ఎండ్ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో హంగామా బిగిన్ చేసేసింది.

ఓవర్ సీస్ లో ఒక్క అమెరికాలోనే 160 లొకేషన్లలో విడుదలైన DJ,  బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చెరో 20కి పైగా లొకేషన్లలో రిలీజ్ అయింది. వీటితో పాటు కెనడా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్ దేశాల్లో డీజే సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఓవరాల్ గా ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ చూస్తుంటే బన్ని కరియర్ లో మరో బ్లాక్ బస్టర్ రిజిస్టర్ అయినట్టే అనిపిస్తుంది.