బాలయ్య నుంచి మరో బ్రాండ్ న్యూ స్టిల్
Tuesday,October 08,2019 - 02:30 by Z_CLU
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. `జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్లో రూపొందుతోన్న రెండో చిత్రమిది. బాలకృష్ణ నటిస్తోన్న 105వ చిత్రమిది.
దసరా సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రకు సంబంధించిన మరో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పవర్ఫుల్ లుక్‌లో బాలకృష్ణ రక్తం అంటిన కత్తితో పక్కా మాసీగా కనిపిస్తున్నారు. లుక్ క్లాస్ గా ఉంది కానీ కత్తి పట్టడంతో మాస్ లుక్ వచ్చేసింది.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు,
సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్