బాలయ్య కొత్త సినిమా అప్డేట్స్

Sunday,May 12,2019 - 06:26 by Z_CLU

బాలకృష్ణ కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్ పేజ్ లో జరుగుతున్నాయి. సినిమాలో కీ రోల్స్ ప్లే చేయాల్సిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. సినిమాని మే 17 న గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

సినిమాలో జగపతి బాబు మెయిన్ విలన్ గా నటించనున్నాడు. అయితే  మరో కీ రోల్ కోసం వరలక్ష్మి ని ఫిక్స్ చేసుకున్నారు. మ్యాగ్జిమం ఈ రోల్ కూడా నెగెటివ్ షేడ్స్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

K.S. రవి కుమార్ డైరెక్షన్ లో  ‘జై సింహా’ తరవాత మరోసారి సెట్స్ పైకి రాబోతున్న ఈ సక్సెస్ ఫుల్ కాంబో పై భారీ ఎక్స్ పెక్టే షన్స్ ఉన్నాయి. చిరంతన్ భట్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. C.K. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై C. కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.