బాలయ్య, కేఎస్ రవికుమార్ మూవీ అప్ డేట్స్

Thursday,August 29,2019 - 03:29 by Z_CLU

లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమా స్టార్ట్ చేసిన బాలకృష్ణ, పూర్తిగా ఇప్పుడా సినిమా పనిమీదే పడ్డాడు. గ్యాప్ ను భర్తీ చేస్తూ శరవేగంగా సినిమాను పూర్తిచేస్తున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ థాయ్ లాండ్ లో మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడా షెడ్యూల్ ను బాలయ్య పూర్తిచేశాడు.

చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్‌, భారీ యాక్షన్‌ ఏపిసోడ్‌ను షూట్‌ చేశారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య కొత్తగా ముస్తాబయ్యాడు. టాలీవుడ్ టోనీ స్టార్క్ గా మారాడు. రీసెంట్ గా బయటకొచ్చిన ఆ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్