నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా

Tuesday,October 08,2019 - 01:05 by Z_CLU

2018లో `మ‌హాన‌టి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన సంస్థ స్వ‌ప్న‌సినిమా. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. దీంతో పాటు ఈ బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా రానుంది. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు నిర్మాతలుగా ఈ సినిమా రాబోతోంది.

ఈ ఏడాది `ఓ బేబీ` చిత్రంతో నందినీ రెడ్డి సూప‌ర్ హిట్‌ కొట్టారు. ఇప్పుడీమె ప్రియాంక ద‌త్ నిర్మాణంలో కాంటెంప‌ర‌రీ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించ‌నున్నారు. `మ‌హాన‌టి`, `ఓ బేబీ` చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె.మేయ‌ర్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు.

ఓ బేబీకి వర్క్ చేసిన ల‌క్ష్మీ భూపాల్, ఈ సినిమాకు కూడా ర‌చయిత‌గా ప‌నిచేస్తున్నారు. జ‌య‌శ్రీ ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తుండ‌గా.. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోహీరోయిన్ల వివరాల్ని త్వరలోనే వెల్లడించబోతున్నారు. అన్నట్టు ఈ సినిమాకు అన్నీ మంచి శకునములే అనే టైటిల్ అనుకుంటున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: BV నందిని రెడ్డి
నిర్మాత‌: ప‌్రియాంక ద‌త్‌
బ్యాన‌ర్‌: స్వ‌ప్న సినిమాస్‌
మ్యూజిక్‌: మిక్కీ జె.మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: రిచర్డ్ ప్ర‌సాద్‌
ర‌చ‌యిత‌: ల‌క్ష్మీ భూపాల్‌
ఆర్ట్‌: జ‌య‌శ్రీ