జీ సినిమాలు ( 9th అక్టోబర్ )

Tuesday,October 08,2019 - 10:03 by Z_CLU

రంగుల రాట్నం
నటీనటులు రాజ్ తరుణ్, శుక్లా
ఇతర నటీనటులు : సితార, ప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ : శ్రీరంజని
ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017
ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార)  తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని  అమ్మతో చెప్పి కీర్తికి  చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో  విష్ణుకి దగ్గరవుతుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు  అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.

==============================================================================

బలాదూర్

నటీనటులు రవితేజ, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు కృష్ణ, చంద్ర మోహన్, ప్రదీప్ రావత్, సునీల్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధాకృష్ణన్

డైరెక్టర్ : K.R. ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2008

బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు చంటి. అందుకే అస్తమానం తండ్రితో మాటలు పడుతుంటాడు. అలాంటప్పుడు కూడా చంటి పెదనాన్న రామకృష్ణ చంటికి సపోర్టివ్ గా ఉంటాడు. అందుకే చంటికి పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే ఉమాపతి రామకృష్ణని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు చంటి ఏం చేస్తాడు..? ఎలా తన కుటుంబాన్ని… రామక్రిష్ణని కాపాడుకుంటాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

మిస్టర్

నటీనటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు హేబా పటేల్, నిఖితిన్ ధీర్, ప్రిన్స్ సీసిల్, పృథ్వీ రాజ్, హరీష్ ఉత్తమన్, రవి ప్రకాష్, సత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్

 డైరెక్టర్శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : 7నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరా, చై కి ఏం చెప్పింది? చై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరు? చివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.? ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

=============================================================================

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి
ఇతర నటీనటులు శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్
డైరెక్టర్ ఈశ్వర్
ప్రొడ్యూసర్ మల్లా విజయ ప్రసాద్
రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008
అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

==============================================================================

కాష్మోరా

నటీనటులు : కార్తీ, నయనతార

ఇతర నటీనటులు : సి.దివ్య, శరత్ లోహిత్ వాలా, మధుసూదన్ రావు, పట్టిమంద్రం రాజా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్

డైరెక్టర్ : గోకుల్

ప్రొడ్యూసర్ : S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు

రిలీజ్ డేట్ : 28 అక్టోబర్ 2016

ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీ) కు అతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడు. అలా దొంగ బాబాగా ప్రజల నుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీ) అనే ఓ ప్రేతాత్మ తో ఓపాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడు. అసలింతకీ రాజ్ నాయక్ అనే ఆ ప్రేతాత్మ ఎవరు? అతను ఎందుకు ప్రేతాత్మగా మారాడు? ఆ ప్రేతాత్మకి.. ఈ కాష్మోరాకి సంబంధం ఏమిటి? చివరికి కాష్మోరా ఆ దుష్టశక్తీని ఏ శక్తితో ఎదిరించి అంతమొందించాడు? అనేది చిత్ర కథాంశం.

=============================================================================

పూజ

నటీనటులు :  విశాల్, శృతి హాసన్

ఇతర నటీనటులు సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్,  తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ హరి

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’.  ప్రతి సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్.