నటాషా దోషి ఇంటర్వ్యూ

Thursday,January 11,2018 - 04:25 by Z_CLU

బాలయ్య ‘జై సింహా’ రేపే గ్రాండ్ గా రిలీజవుతుంది. బాలయ్య సరసన నయనతార, నటాషా జోషి, హరిప్రియ నటించిన ఈ సినిమా రిలీజ్ కి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమా గురించి, సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది నటాషా దోషి. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

డాక్టర్ నయ్యాకే యాక్టర్ నయ్యా…

నేను డెంటిస్ట్ ని… ‘జై సింహా’ తెలుగులో నా డెబ్యూ మూవీ.. ఏ సినిమా కన్నా మలయాళంలో ‘మాంత్రికన్’ ‘ Hide & Seek’ సినిమాలు చేశాను. K.S. రవికుమార్ గారి లాంటి టాప్ మోస్ట్ ఫిల్మ్ మేకర్ తో బాలయ్య లాంటి పెద్ద స్టార్ సినిమాతో తెలుగులో లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

అదే నా క్యారెక్టర్…

ఈ సినిమాలో మురళీ మోహన్ గారి కూతురిలా కనిపిస్తానీ సినిమాలో…. పెళ్ళైన చాలా రోజులకు పుట్టడంతో పేరెంట్స్ కొంచెం అతిగా గారం చేయడం, ఫారిన్ కంట్రీ లో పెరగడం ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాలో నేను స్పాయిల్ కిడ్ లా కనిపిస్తాను…

నేను ట్రై చేయలేదు…

ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ కోసం దాదాపు 100 కు పైగా అమ్మాయిలను చూసారంట. ఆ ఆ తరవాత నా గురించి ఎవరో సజెస్ట్ చేయడం, అలా నన్ను అప్ర్చ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా కోసం నేను ట్రై చేయడం కంటే, వాళ్ళే నన్ను ట్రై చేశారు.

అమ్ముకుట్టి సాంగ్ నాదే…

నాకు రెండున్నరేళ్ళప్పటి నుండే భరతనాట్యం నేర్చుకున్నాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అమ్మ కుట్టి సాంగ్ బాలయ్యతో పాటు స్టెప్స్ వేసే చాన్స్ వచ్చినందుకు చాలా హ్యాప్పీగా ఉంది.

నా కోసం సినిమా చూస్తారు…

బిగినింగ్ లో బాలయ్యతో స్టెప్స్ అనగానే కొంచెం నర్వస్ గా ఫీలయ్యా. కానీ అమ్ముకుట్టి సాంగ్ ప్రోమో చూసి, మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారు. మీ డ్యాన్స్ కోసం సినిమా చూస్తాం అని సోషల్ మీడియాలో మెసేజెస్ పెడుతున్నారు, చాల హ్యాప్పీ….

 

చిన్నప్పటి నుండే నటిస్తున్నా…

డాక్టర్ నవ్వాలన్నది నా పేరెంట్స్ కోరిక. కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుండి నాకు మాత్రం యాక్టర్ అవ్వాలనే ఉండేది. చిన్నప్పుడు కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా నటించాను.

హీరో కన్నా స్టోరీ ఇంపార్టెంట్…

ఒకరకంగా చెప్పాలంటే మన కో స్టార్ ఎవరూ అనేకంటే స్టోరీ ఎలాంటిది అన్నదే చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాం. జై సింహా లో నా క్యారెక్టర్ నాకు మంచి ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నాను.

నయనతార గురించి తెలుసు…

నయనతార బేసిగ్గా మలయాళి కాబట్టి నేను తన మలయాళం సినిమాలన్నీ చూశాను, తను ఎంత అందంగా ఉంటుందో, అంతకన్నా బెస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది… ఆవిడ దగ్గర్నించి చాలా నేర్చుకోవచ్చు. అంత గొప్ప నటితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టం… ఆవిడ నటించిన ‘బాడీగార్డ్’ (మలయాళం)మూవీ చాలా ఇష్టం.