రంగులరాట్నం హైలైట్స్

Thursday,January 11,2018 - 03:38 by Z_CLU

ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన రంగులరాట్నం సినిమా, ఈనెల 14న థియేటర్లలోకి వస్తోంది. ఉయ్యాలజంపాల లాంటి సూపర్ హిట్ తర్వాత అన్నపూర్ణ బ్యానర్ పై రాజ్ తరుణ్ చేసిన సినిమా ఇది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి.


స్టోరీలైన్ :

ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలు చూశాం. అమ్మాయి లేదా అబ్బాయిని ప్రేమలో పడేయడం వరకే ఎక్కువగా హైలెట్ చేస్తూ వచ్చాయి చాలా సినిమాలు. రంగులరాట్నంలో మాత్రం పోస్ట్-లవ్ తర్వాత పరిస్థితుల్ని చర్చించారు. ప్రేమికుల
మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది… ఒకర్ని అర్థం చేసుకోవడంలో మరొకరు ఎందుకు ఫెయిల్ అవుతుంటారు లాంటి సెన్సిబుల్ ఎలిమెంట్స్ ను రంగులరాట్నంలో టచ్ చేశారు. సినిమా మొత్తం ఫీల్-గుడ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది.


హీరో రాజ్ తరుణ్:

ఇలాంటి ప్రేమకథల్ని పండించాలంటే నేచురల్ గా నటించడంతో పాటు బాయ్ నెక్ట్స్ డోర్ లుక్స్ ఉన్న హీరో కావాలి. అలాంటి క్వాలిఫికేషన్లు పుష్కలంగా ఉన్న రాజ్ తరణ్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. ఇంకా చెప్పాలంటే రంగులరాట్నానికి స్టార్ ఎట్రాక్షన్ ఇతడే. రాజ్ తరుణ్ యాక్టింగ్, లుక్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో
సినిమాపై బజ్ జనరేజ్ అయింది

హీరోయిన్ చిత్రా శుక్లా :

కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటే ప్రేమకథలు ఇనిస్టెంట్ గా పండుతాయి. అందుకే రాజ్ తరుణ్ సరసన బ్యూటిఫుల్ అమ్మాయి చిత్రా శుక్లాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ కన్నడ బ్యూటీ తన ఎక్స్ ప్రెషన్స్ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత చిత్రా శుక్లా మరింత ఫేమస్ అయిపోవడం గ్యారెంటీ.


దర్శకురాలు శ్రీరంజని :

రంగులరాట్నం సినిమాతో దర్శకురాలిగా పరిచయమౌతోంది శ్రీరంజని. అన్నపూర్ణ స్టుడియోస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ పై దర్శకురాలిగా అవకాశం వచ్చిందంటే.. ఆమె చెప్పిన కథ నాగార్జునను ఎంతలా ఎట్రాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. యంగ్ టాలెంట్ ను ఎప్పుడూ ప్రోత్సహించే నాగ్, శ్రీరంజని రూపంలో మరో టాలెంటెడ్ డైరక్టర్ ను టాలీవుడ్ కు అందిస్తున్నాడు

ప్రొడక్షన్ వాల్యూస్ :

రంగులరాట్నం  మీడియం రేంజ్ బడ్జెట్ మూవీనే కావొచ్చు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అన్నపూర్ణ స్టుడియోస్ స్థాయికి తగ్గట్టు లావిష్ గా తెరకెక్కింది రంగులరాట్నం.


శ్రీచరణ్ మ్యూజిక్

సినిమాకు మరో మేజర్ హైలెట్ శ్రీచరణ్ మ్యూజిక్. సినిమా థీమ్ మ్యూజిక్ తో పాటు సాంగ్స్ అన్నీ క్యాచీగా ఉన్నాయి. యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సినిమా సక్సెస్ లో శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ది కూడా కీలక పాత్ర కానుంది.