నారా రోహిత్ మేకోవర్ అదిరింది..

Tuesday,February 14,2017 - 02:36 by Z_CLU

పోస్టర్ చూసినవెంటనే అసలు ఎవరీ హీరో అనుకున్నారు. కొందరేమో కొత్త హీరో అనుకున్నారు కూడా. కానీ ఈ పోస్టర్ లో మనం చూస్తున్నది హీరో నారా రోహిత్. మొన్నటివరకు కథల ఎంపికలో సంథింగ్ స్పెషల్ అనిపించుకున్న ఈ హీరో, ఇప్పుడు మేకోవర్స్ లోకి కూడా దిగాడు. ప్రస్తుతం నారా రోహిత్.. కథలో రాజకుమారి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుట్టుచప్పుడు కాకుండా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నిన్ననే ఈ సినిమా టైటిల్ విడుదల చేశారు. ఇప్పుడా టైటిల్ కు కొనసాగింపుగా నారా రోహిత్ స్టిల్ తో పోస్టర్ రిలీజ్ చేశాారు. పోస్టర్ చూసి అంతా షాక్.

nara-rohith-new-still

నారా రోహిత్ ఇప్పటివరకు కనిపించని కొత్త గెటప్ ఇది. గుబురు గడ్డం, పెద్దపెద్ద మీసాలు, చేతిలో కత్తి, నోట్లో సిగరెట్, గళ్ల లుంగీ… నిజంగా ఇతడు నారా రోహితేనా అనిపించేలా ఉంది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్. ఈ ఒక్క లుక్ తో సినిమాపై అంచనాల్ని బీభత్సంగా పెంచేశాడు నారా రోహిత్. మహేష్ సూరపునేని డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు నిర్మాత కూడా నారా రోహితే కావడం విశేషం. గతంలో ఈ హీరో అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా టైపులోనే కథలో రాజకుమారి అనే ఈ సినిమా కూడా సైలెంట్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది యూనిట్.