1 మిలియన్ వ్యూస్ అందుకున్న 'విన్నర్' ట్రైలర్

Tuesday,February 14,2017 - 01:06 by Z_CLU

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విన్నర్’ రిలీజ్ కి ముందే ట్రైలర్ తో హల్చల్ సోషల్ మీడియా లో హంగామా చేస్తుంది  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కు తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై కేవలం రెండు రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యింది ..

తొలి సారిగా ట్రైలర్ తో 1 మిలియన్ వ్యూస్ అందుకొని సినిమా పై భారీ అంచనాలు  పెంచేశాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ లో పెర్ఫార్మ్ చేసింది… థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మూడు పాటలు ఇటీవలే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. నల్లమలుపు బుజ్జి , ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 24 విడుదలకి రెడీ అవుతుంది..