ప్రభాస్ హీరోయిన్స్.....

Tuesday,February 14,2017 - 04:30 by Z_CLU

‘బాహుబలి’ కోసం దాదాపు నాలుగున్నర ఏళ్ళు కష్టపడిన ప్రభాస్ ఎట్టకేలకి నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేశాడు. సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కబోయే ఈ సినిమా ఈమధ్యే లాంఛ్ అయింది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే టాపిక్ పై ఇండస్ట్రీలో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

jodi-_-1
ప్రభాస్ హీరోయిన్ల లిస్ట్ లో కాజల్ ఎప్పుడూ ఉంటుంది. గతంలో ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాల్లో ప్రభాస్ కు జోడీగా నటించిన ఈ కలువకళ్ల చిన్నది… మరోసారి యంగ్ రెబల్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోడానికి రెడీగా ఉంది. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్ అనే విషయం అందరికీ తెలుసు. మరి ప్రభాస్ మరోసారి కాజల్ కు ఛాన్స్ ఇస్తాడా…?

jodi-_-2

ప్రస్తుతం హీరోలంతా రకుల్ ప్రీత్ సింగ్ కోసం వెయిటింగ్. ఎందుకంటే, ఈ పొడుగుకాళ్ల చిన్నది అడుగుపెట్టిందంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉంది. సో.. ఈ సెంటిమెంట్ ప్రకారం.. ప్రభాస్ సరసన రకుల్ ను ట్రైచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమాత్రం కాల్షీట్లు ఖాళీ ఉన్నా… ప్రభాస్ సరసన కనిపించే ఛాన్స్ ను మిస్ చేసుకోదు రకుల్.

jodi-_-3

ప్రభాస్ నటించబోయే ఈ సినిమాలో సమంత పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవలే ఈ భామ బడా సినిమాలు చేస్తున్నట్లు చెప్పడం, పైగా టాలీవుడ్లో ఆల్మోస్ట్ అందరు స్టార్స్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ తో ఇప్పటివరకూ నటించకపోవడంతో ఈ జోడీ సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. పైగా రామ్ చరణ్ తో సినిమా ఎనౌన్స్ చేసిన సమంత… మరో బడా ప్రాజెక్టులో కూడా నటించే ఛాన్స్ ఉందని హింట్ కూడా ఇచ్చింది.

jodi-_-4

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్న శృతిహాసన్ కూడా ప్రభాస్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది. పవన్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ…ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ తో కూడా కలిసి నటించేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తోంది.

jodi-_-5

ప్రభాస్ తో ఇప్పటికే 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్న తమన్నా పేరు కూడా లిస్ట్ లో వినిపిస్తోంది. లేటెస్ట్ గా ‘బాహుబలి’ సినిమాతో ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసిన ఈ జోడీ… మరోసారి మెస్మరైజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే బాహుబలి ప్రయాణంలో నాలుగేళ్లపాటు టచ్ లో ఉన్న మిల్కీబ్యూటీకి ప్రభాస్ మరోసారి ఛాన్స్ ఇస్తాడా అనేది పెద్ద డౌట్.

jodi-_-6

ఇక ప్రభాస్ సరసన ఓ ఫ్రెష్ జోడీ ఉండాలని యూనిట్ భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఛాన్స్ కీర్తి సురేష్ కి సొంతం అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పటికే 2 సూపర్ హిట్స్ అందుకొని త్వరలో పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న ఈ కోలీవుడ్ బ్యూటీ కూడా ప్రభాస్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది.

jodi-_-7

ఇక టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశి ఖన్నా కూడా రేసులో ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ గ్లామరస్ బ్యూటీని ప్రభాస్ కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది.