తిరుపతిలో కృష్ణార్జునుల హంగామా

Saturday,March 31,2018 - 11:35 by Z_CLU

మరికొన్ని గంటల్లో నాని హంగామా మొదలుకానుంది. నేచురల్ స్టార్ నటించిన కృష్ణార్జున యుద్ధం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో గ్రాండ్ గా ప్రారంభంకానుంది. పట్టణంలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో సాయంత్రం 7 గంటల నుంచి కృష్ణార్జునుల హంగామా షూరూ కానుంది.

ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడు నాని.  ఒక క్యారెక్టర్ పేరు కృష్ణ, మరో క్యారెక్టర్ పేరు అర్జున్. కృష్ణ అనే పాత్ర తిరుపతి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సినిమాలో నాని, అచ్చమైన చిత్తూరు యాసలో మాట్లాడతాడు. అందుకే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో ప్లాన్ చేశారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.