నాని కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,December 28,2017 - 11:45 by Z_CLU

ప్రస్తుతం ఎంసీఏతో థియేటర్లలో హంగామా చేస్తున్నాడు నాని. ఈ మూవీ తర్వాత నాని నుంచి రాబోయే కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. నాని ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది కృష్ణార్జున యుద్ధం. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మేజర్ షెడ్యూల్ ను పారిస్ లో కంప్లీట్ చేశారు.

సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి సమర్పిస్తున్నాడు. జెండాపై కపిరాజు, జెంటిల్ మేన్ సినిమాల తర్వాత నాని డ్యూయల్ రోల్ చేస్తున్న మూవీ ఇదే.