కృష్ణ, అర్జున్ కామన్ గా పాస్ అయిపోయారు

Thursday,April 05,2018 - 04:20 by Z_CLU

వరుసగా 8 హిట్స్ వచ్చాయి. ఇంకొక్క హిట్ బ్యాలెన్స్. ఆ ఒక్కటి తగిలితే అరుదైన రికార్డు. అవును.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ట్రిపుల్ హ్యాట్రిక్ (9వ హిట్)కు రెడీ అయిపోయాడు మన నేచురల్ స్టార్. అందుకే కృష్ణార్జు యుద్ధంపై అందరి కన్ను. ఇది హిట్ అయితే నానికి ట్రిపుల్ హ్యాట్రిక్కే. రిలీజ్ ప్రాసెస్ లో భాగంగా సెన్సార్ పూర్తిచేసుకుంది ఈ సినిమా.

కృష్ణార్జున యుద్ధం సినిమాను చూసిన సెన్సార్ అధికారులు సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. నాని డ్యూయల్ రోల్ గెటప్స్ బాగున్నాయని, రెండు గెటప్స్ వేటికవే డిఫరెంట్ గా ఉన్నాయనేది సెన్సార్ రిపోర్ట్. ఈనెల 12న థియేటర్లలోకి రానుంది కృష్ణార్జున యుద్ధం.

పురాణాల్లో కృష్ణుడు, అర్జునుడు క‌లిసి మ‌హాభార‌త యుద్ధంలో శ‌త్రువుల‌ను జ‌యించారు. ఇప్పుడు మ‌రోసారి కృష్ణ‌, అర్జున్ క‌లిసి ఓ మంచి ప‌ని కోసం వేసే అడుగే మా `కృష్ణార్జున యుద్ధం` అని అంటున్నారు నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు.