పెళ్లిపై రియాక్ట్ అయిన ప్రభాస్

Tuesday,June 19,2018 - 01:41 by Z_CLU

ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు..?
ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు..?
టాలీవుడ్ లో రెగ్యులర్ గా డిస్కషన్ జరిగే పాయింట్ ఇది. దీనిపై ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అప్పటికప్పుడు ప్రభాస్ క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. కానీ రూమర్స్ ఆగడం లేదు. ప్రభాస్ రియాక్ట్ అవ్వక తప్పడం లేదు. లేటెస్ట్ గా మరోసారి దీనిపై రియాక్ట్ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్.

“పెళ్లనేది నా వ్యక్తిగతం. దానిపై చర్చించాల్సిన అవసరం లేదు. అంతా అనుకుంటున్నట్టు నా పెళ్లి ఇంకా ఎవరితో ఫిక్స్ అవ్వలేదు. నిజంగా ఆ టైమ్ వచ్చినప్పుడు నేనే స్వయంగా ఎనౌన్స్ చేస్తాను.”

ఇలా తన పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. నిజానికి బాహుబలి-2 రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అప్పటికే డిలే అయిన సాహో ప్రాజెక్టును మరింత వెనక్కి నెట్టడం ఇష్టంలేక వెంటనే అది స్టార్ట్ చేశాడు.

మరోవైపు ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందంటూ కృష్ణంరాజు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ప్రభాస్ మాత్రం పెళ్లికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేదు. బహుశా సాహో కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడేమో.