Official నాని హీరోగా HIT3

Friday,December 02,2022 - 04:12 by Z_CLU

శైలేష్ కొలను దర్శకుడిగా నాని సమర్పణలో వచ్చిన ‘హిట్3’ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రిలీజ్ రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాకు కొనసాగింపు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు శైలేష్ , నాని ఇద్దరూ హిట్ వర్స్ ఇలాగే కంటిన్యూ అవుతుందని , ఒక్కో పార్ట్ లో ఒక్కో హీరో ఉంటాడని చెప్పేశారు. తాజాగా హిట్3 లో కనిపించబోయే హీరోను హిట్2 క్లైమాక్స్ లో రివీల్ చేసి రాబోయే మూడో కేస్ పై అంచనాలు పెంచేశారు.

HIT ఫస్ట్ కేస్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు , సెకండ్ కేస్ లో అడివి శేష్ నటించారు. ఇప్పుడు థర్డ్ కేస్ లో నాని హీరోగా కనిపించాబోతున్నాడు. అర్జున్ సర్కార్ అనే పవర్ పోలీస్ పాత్రలో నటించనున్నాడు నాని. హిట్2 ఎండింగ్ లో నాని కేరెక్టర్ ఎలా ఉండనుంది ? అతని మైండ్ సెట్ ఏంటి ? లాంటి డీటెయిల్స్ వాయిస్ ద్వారా చెప్తూ హిట్3 పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు శైలేష్ కొలను.

వందమంది అమాయకులు చనిపోయినా పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ కూడా తప్పించుకోకూడదనుకునే మైండ్ సెట్ ఉన్న ఆఫీసర్ అంటూ , నాని గురించి టీం మెంబర్ శేష్ కి చెప్పే సీన్ హిట్ ఫ్రాంచైజ్ పై భారీ ఎక్స్ పెక్టేషన్ పెంచేసింది. మరి నిర్మాతగా ఇద్దరు యంగ్ హీరోలకి హిట్ ఇచ్చిన నాని ఇప్పుడు తను కూడా ప్రొడ్యూసర్ కం హీరోగా హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు. హిట్3 లో నానితో పాటు శేష్ కూడా నటించనున్నాడు. కానీ మెయిన్ లీడ్ మాత్రం నానినే.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics