రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాని

Saturday,June 03,2017 - 07:10 by Z_CLU

నేచురల్ స్టార్ తన లేటెస్ట్ మూవీ ‘నిన్ను కోరి’ సినిమా కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా ‘నేను లోకల్‌’సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నిన్ను కోరీ’ సినిమాలో నటిస్తున్నాడు.


ప్రెజెంట్ షూటింగ్ ఫైనల్ స్టేజీ కి చేరుకున్న ఈ సినిమాను మొదట జూన్ 23 న రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ ఆ డేట్ కి బన్నీ ‘డీజే’ సినిమా రిలీజ్ కానుండడంతో  రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు యూనిట్. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను జులై 7 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సో జులై మొదటి వారంలో ఈ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తాడన్నమాట నాని