జీ సినిమాలు (4th జూన్)

Saturday,June 03,2017 - 10:02 by Z_CLU

ధర్మచక్రం

నటీ నటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ

ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 జనవరి 1996

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

=============================================================================

ఏ మాయ చేశావే

నటీనటులు : నాగ చైతన్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : కృష్ణుడు, దేవన్, సుధీర్ బాబు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ : మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్

రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2010

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య కరియర్ ట్రాక్ నే మార్చేసింది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సమంతా, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. అంత ఇంపాక్ట్ ని చూపించింది ఈ సినిమా. అతి సాధారణ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. A.R. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

డైనోషార్క్

నటీనటులు : ఎరిక్ బాల్ఫోర్, ఐవ హాస్పర్ గర్

ఇతర నటీనటులు : ఆరోన్ డియాజ్, రోజర్ కార్మన్, వెల హామ్మండ్, బ్లాంచ్ వీలర్, షాన్ కార్సన్, జెన్న మ్యాంగర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సింథియా బ్రౌన్

డైరెక్టర్ : కెవిన్ ఓ నీల్

ప్రొడ్యూసర్ : రోజర్ కార్మన్, జూలీ కార్మన్

రిలీజ్ డేట్ : మార్చ్ 13, 2010

ఒక సైంటిస్ట్ షార్క్ పై చేసిన DNA ఇంప్లిమెంటేషన్ తో డైనోషార్క్ లా మారిన షార్క్ సముద్రంలోకి ప్రవేశించి అక్కడికి వచ్చిన  యాత్రికులను, ఈత్ అగాల్లను చంపేస్తుంటుంది. ఈతకు వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాకపోయేసరికి వారి చావు పెద్ద మిస్టరీగా మారుతుంది. అసలీ డైనోషార్క్ గురించి ఎప్పుడు తెలుస్తుంది..? ఆ తరవాత ఏం జరుగుతుందనేది ఈ సినిమాలోని ప్రధానాంశం.

=============================================================================

 శ్రీకృష్ణ తులాభారం

నటీ నటులు : N.T.రామారావు, జమున, అంజలి

ఇతర నటీనటులు : S.వరలక్ష్మి, L.విజయలక్ష్మి, కాంతారావు, రాజనాల, పద్మనాభం, వాణిశ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల

డైరెక్టర్ : K. కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1966

NTR కరియర్ లోని పౌరాణిక సినిమాల్లో ఒక ఆణిముత్యం శ్రీ కృష్ణ తులాభారం.. శ్రీకృష్ణుడు తన భార్యల మధ్య అపురూప సన్నివేశాలతో అద్భుతంగా తెరకెక్కిందే శ్రీ కృష్ణ తులాభారం. పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమాకి K.కామేశ్వర రావు డైరెక్షన్ చేశారు.

==============================================================================

జీవన తరంగాలు

నటీ నటులు : శోభన్ బాబు, కృష్ణం రాజు, వాణి శ్రీ,

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, అంజలీ దేవి, లక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వర రావు

మ్యూజిక్ డైరెక్టర్ : జె. వి. రాఘవులు

డైరెక్టర్ : తాతినేని రామారావు

ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1973

యద్దన పూడి సులోచనా రాణి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం జీవన తరగాలు. 1973 లో రిలీజ్ అయి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తరవాత ఈ సినిమాని హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమాని మూవీ మొఘల్ రామానాయుడు గారు తెరకెక్కించారు.

==============================================================================

వీరుడొక్కడే

నటీ నటులు : అజిత్, తమన్నా

ఇతర నటీనటులు : సంతానం, ప్రదీప్ రావత్, విద్యుల్లేఖ

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : J. శివకుమార్

నిర్మాత : భారతి రెడ్డి

విలక్షణమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అజిత్. అందుకే అజిత్ కి సౌత్ ఇండియా మొత్తంలో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమిళంలో సూర్ హిట్టయిన ‘వీరం’ తెలుగులో వీరుడొక్కడే గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలతో పాటు అజిత్ ఫైట్స్, స్టంట్స్ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.