ఆ వార్త పై స్పందించిన విజయ్

Saturday,June 03,2017 - 06:10 by Z_CLU

ఓ హీరో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదుగుతున్నాడంటే.. ఆ హీరో పై కొన్ని గాలి వార్తలు పుట్టుకురావడం సహజమే. అయితే ఇలాంటి వార్తే ఇప్పుడు యంగ్ హీరో విజయ్ దేవర కొండ చుట్టూ తిరుగుతుంది. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వీటితో పాటు మరో రెండు సినిమాలతో బిజీ గా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ విన్నీ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడనే వార్త వైరల్ అవుతుంది.

ప్రెజెంట్ తన పెళ్లి పై వస్తున్న వార్తలపై లేటెస్ట్ గా స్పదించాడు విజయ్ దేవర కొండ. 14 గంటలు ఫ్లయిట్ లో ఉంటె ఇండియా లో నా పెళ్లి చేస్తున్నారంట.. అంతా బాగానే ఉంది గాని నాకు విన్నీ కి ‘రమ్మీ-డమ్మీ’ అనే పిల్లలు కూడా వున్నారని రాయడం మర్చిపోయారేమో..ఎనీవేస్ పెళ్లి చేసుకుంటున్న సందర్భంగా నన్ను ఇలా విష్ చేసిన మీడియాకి థాంక్స్.. ఫన్నీ గాసిప్… అంటూ సరదాగా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు విజయ్.