హీరో నాని ఇంటర్వ్యూ

Thursday,February 15,2018 - 03:09 by Z_CLU

నాని అ! మూవీ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన ప్పటి నుండి రిలీజ్ వరకు చేసిన అద్భుతమైన జర్నీని మీడియాతో షేర్ చేసుకున్నాడు నాని.

రిలీజ్ అనేది పరీక్షే…

నిన్న కొంతమంది ఫ్రెండ్స్ కి సినిమా చూపించాను. అష్టా చెమ్మా అప్పుడు కూడా అంతే… అదే ల్యాబ్…  అదే టెన్షన్… నాకర్థమయింది ఏంటంటే, ఎన్ని సినిమాలు చేసిన మనకు రిలీజ్ అనేది ప్రతిసారి కొత్తే… అదే టెన్షన్.

తేడా ఏమీ ఉండదు

ఈ సినిమాకి డబ్బులు పెట్టామని టెన్షన్ కాదు.. నేను డబ్బులు పెట్టకపోయినా అంతే టెన్షన్ ఉంటుంది. సినిమా అనేది బాధ్యత. సక్సెస్ అయితేనే అందరికీ  హ్యాప్పీ.

 

అవసరం అనిపించే చేశాను.

తెలుగులో డిఫెరెంట్ సినిమాలు రావడం లేదు.. ఎవరూ చేయడం లేదు అనుకోవడం కన్నా, మనమే ఎందుకు చేయకూడదు అనుకుని చేసిన సినిమా ఇది. ఇండస్ట్రీలో ఇలాంటి చేంజ్ అవసరం అనిపించే ఈ సినిమాని నిర్మించాను.

నిద్ర లేని రాత్రులెన్నో.

అటు కృష్ణార్జున యుద్ధం మూవీ, ఇటు ఈ సినిమా.. రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైంది. ప్రస్తుతం గోవాలో షిప్ లో, సముద్రం మధ్యలో షూటింగ్ జరుగుతుంది. అస్సలు సిగ్నల్ ఉండదు. సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా వెదుక్కుని  మరీ టీమ్ తో కమ్యూనికేట్ అవ్వాలి. ప్రొడ్యూసర్ అన్నాక ప్రతి డిపార్ట్ మెంట్ తో కనెక్ట్ అవ్వాలి.

కాకపోతే కిక్కుంది.

ఏం చేసినా ఇష్టపడే చేస్తాం కాబట్టి కష్టపడ్డా అందులో కిక్ ఉంటుంది. నిద్ర సరిపోకపోయినా ఎగ్జైట్ మెంట్ తో పొద్దునే లేచి కూర్చుంటాం.

అవగాహన వచ్చింది

ఒక సినిమా వెనక ప్రొడ్యూసర్ పడే కష్టాలేంటనేది ఈ సినిమా ద్వారా తెలిసొచ్చింది. ఇంతకు ముందు కూడా తెలుసు. కాకపోతే ఈ సినిమాతో నిర్మాణ బాధ్యతలపై పూర్తి అవగాహన వచ్చింది.

ఫార్మాట్ మారాలి

సినిమా అనేది ఆర్ట్ తో పాటు బిజినెస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే బిజినెస్ ని మైండ్ లో పెట్టుకుంటామో, ఆర్ట్ వాల్యూ పడిపోతుంది. ఎలాంటి సినిమా తీస్తే ఆడుతుంది అని తీయడం వేరు. బిజినెస్ గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా, ఏదో కొత్తదనం ఎక్స్ పెక్ట్ చేస్తున్న ప్రేక్షకుడి కోసం తీసిన సినిమా ఇది. ప్రస్తుతం ఉన్న సినిమా ఫార్మాట్ మారి కొత్తదనం రావాలని చేసిన సినిమా అ!

నేనే రిలీజ్ చేస్తున్నా

నాకు కొద్దో గొప్పో పేరుంది, నేను చేసిన సినిమాలు ఈ మధ్య సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ తో చాలా మంది ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. కానీ ఇది నేను చేస్తున్న రిస్క్, అ! లాంటి డిఫెరెంట్ సినిమా చేయాలనేది నేను తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఎవరినో ఎందుకు రిస్క్ లో పెట్టాలి. అందుకే సినిమాని నేనే రిలీజ్ చేస్తున్నా. ఇది సక్సెస్ అయితే రెగ్యులర్ సినిమా ఫార్మాట్ మారిపోతుంది.

 

అప్పుడే అర్థమయింది

ఒక కొత్త కథని ఇంత డిఫెరెంట్ గా, డీటేలింగ్ గా రాసుకుని నా దగ్గరికి వచ్చి కథ చెప్పగలిగాడంటే డైరెక్టర్ గా సగం సక్సెస్ అయినట్టే. అందుకే డెబ్యూ డైరెక్టర్.. చేయగలుగుతాడా లేదా..? అనే అనుమానమే రాలేదు.

సినిమా ప్రాసెస్ లోనే జరిగింది

కాజల్, నిత్యా మీనన్.. రెజీనా వీళ్ళంతా నాకోసం ఈ సినిమా చేయలేదు. కథ విని సినిమా చేశారు. ప్రతిదీ సినిమా ప్రాసెసింగ్ లోనే జరిగింది. కాకపోతే వాళ్ళు ఒక్కో సినిమాకి 40 – 45 రోజులు షూటింగ్ చేస్తారు, ఈ సినిమాకి అన్ని రోజులు చేయరు కాబట్టి, ఒక రెమ్యూనరేషన్ అనుకున్నారు.. దాన్ని బట్టే జరిగింది. నేను ప్రొడ్యూసర్ లాగానే ఉన్నాను. వాళ్ళు యాక్టర్స్ లాగానే చేశారు. ఇక్కడ ఎవరూ ఎవరి కోసం చేయలేదు. కథను నమ్మే చేశారు.

నేనెప్పుడూ అందుబాటులోనే ఉంటాను

మంచి సినిమాలు చేశాను. సాధారణ నటుడి స్థాయి నుండి సినిమా ప్రొడ్యూస్ చేసే స్థాయిలో ఈ రోజు ఉన్నానంటే, దాని వెనకాల చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను నిర్మాతను అయ్యాను కదా అని నా సినిమాలు నేను చేసుకోను… నేనెప్పుడూ అందుబాటులో ఉంటా.

 

అప్పుడే చేస్తా…

వాల్ పోస్టర్ బ్యానర్ పై జస్ట్ డబ్బుల కోసమే సినిమా అస్సలు చేయను. మళ్ళీ ఇలాగే ఒక మంచి కథ వినిపించి, చేసేద్దామనిపించిన రోజే సినిమా చేస్తాను. ఏమో ఈ సినిమా తరవాత ఇంకొన్ని రోజులు సినిమా ప్రొడ్యూస్ చేయకపోవచ్చు…

ఇతర భాషల్లో…

మొన్న సత్యం సినిమాస్ వాళ్ళు వచ్చి సినిమా చూసి కాసేపు అసలేమీ మాట్లడలేకపోయారు. ఆ తరవాత ఈ సినిమాని తమిళం, మలయాళంలో రిలీజ్ చేస్తున్నాం. మీరు రీమేక్ గురించి కూడా ఆలోచించ వద్దన్నారు. జస్ట్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దాం. స్ట్రయిట్ సినిమా అంత ఇంపాక్ట్ ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ బిగిన్ చేసే ప్రాసెస్ లో ఉన్నాం.. త్వరలో, మళయాళ, తమిళ భాషల్లో అ! రిలీజవుతుంది.

అప్పటికీ ఆ ఆలోచన లేదు

ఈ కథ విన్నాక కూడా నేనే ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన లేదు. ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ ని చూసి పెట్టాలి ఈ కుర్రాడికి అనుకున్నా. నాకు తెలిసిన సర్కిల్ లో ట్రై చేశా కానీ ఈ కథని నమ్మి చేసే ప్రొడ్యూసర్ కావాలి. అప్పుడనిపించింది నేనే ఎందుకు చేయకూడదని. నేను నమ్ముతున్నాగా.. అప్పుడు డిసైడ్ అయ్యా…

ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే…

ఏమీ లేని నాకు ఈ స్థాయి ఇచ్చింది సినిమానే, అందుకే సినిమా నాకేం ఇచ్చిందో అదే సినిమాకు కూడా ఇచ్చేయాలి. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తా… ఈ రోజు నా దగ్గరున్న ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే… అలాంటప్పుడు సినిమాకు పెట్టడంలో తప్పేంటి.

అప్పుడే నా కరియర్ కి అర్థం ఉంటుంది…

సినిమా ఇండస్ట్రీలో మార్పుకి చాలా ప్రయత్నాలు చేశారు. వాల్ పోస్టర్స్ సినిమా బ్యానర్ పై కూడా డిఫెరెంట్ సినిమాలు వచ్చేవి. ఈ రోజు ఉన్న ఈ మార్పులో వాల్ పోస్టర్ సినిమాస్ ప్రయత్నం కూడా ఉంది అని చెప్పుకుంటే చాలు.. అప్పుడే నా కరియర్ కి అర్థం ఉంటుంది…

కథ చెప్పలేం…

నా ప్రతి సినిమా కథని ట్రైలర్ లో రివీల్ చేస్తుంటాం. ఎందుకంటే కథ పాతదే కానీ మనకు తెలిసిన ఒక ఇమోషనల్  జర్నీని ట్రావెల్ చేస్తాం అది నచ్చితే సినిమా హిట్టు. కానీ ఈ సినిమా అలా కాదు. మీకు ఈ సినిమాలో ఆశ్చర్యం కలుగుతుంది, చిరాకు కలుగుతుంది… ఎగ్జైట్ మెంట్ కలుగుతుంది.. ఇలా అన్ని రకాల ఫీలింగ్స్ బ్లెండ్ అయి అద్భుతంగా ఫీల్ అయి బయటికి వస్తారు.

అందరికీ నచ్చకపోవచ్చు

సినిమా ఒక పర్టికులర్ ఆడియెన్స్ కి నచ్చుతుంది. అందరికీ నచ్చకపోవచ్చు. ఒక ప్లేట్ లో పాస్తా, బిర్యాని, పప్పన్నం ఎలా సర్వ్ చేయలేమో, అందరికీ ఒకేసారి నచ్చేలా సినిమా చేయలేం… ఎవరినీ టార్గెట్ చేసి సినిమా చేయలేదు.

ఫిల్మ్ ఫెస్టివల్స్ కి….

మన సినిమాలు మహా అయితే నేషనల్ లెవెల్ కి వెళ్తాయి. కానీ నాకు మన సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్ళాలి. క్వాలిఫై అవ్వాలి.  అ! సినిమాకి అంత వాల్యూ ఉందని నేను నమ్ముతున్నాను.

నా డైరెక్టర్స్ కి ఇప్పటికీ అసిస్టెంట్ ని…

నేను సెట్స్ లో క్యారీవ్యాన్ లోకి వెళ్ళేది జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికే. నా షాట్స్ అయిపోయి అంటే డైరెక్టర్ కి అసిస్ట్ చేస్తుంటా… ఏమైనా కావాలన్నా చూసుకుంటూ ఉంటా… ఇంకా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా రిజైన్ చేయలేదు… సినిమాలో బిగినింగ్ లో నా పేరు వేసినా వేయకపోయినా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో లాస్ట్ కైనా నా పేరు వేయండి అని చెప్తుంటా.. కానీ వేయరు…

నెక్స్ట్ సినిమా…

శ్రీరామ్ ఆదిత్య తో సినిమా ఫిబ్రవరి 24 న లాంచ్ అవుతుంది. ఇంకా స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.