ఈ వీకెండ్ రిలీజెస్

Thursday,February 15,2018 - 12:58 by Z_CLU

భారీ బడ్జెట్ సినిమాలు కావు. మాస్ హీరోలు నటించిన సినిమాలు అంతకంటే కావు. కానీ ఈ వీకెండ్ విడుదలకు సిద్ధమైన 2 సినిమాలు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకం. దేని స్పెషాలిటీస్ దానికున్నాయి. హేవే లుక్.

ఈ వీకెండ్ థియేటర్లలోకొస్తున్న మూవీ “అ!”. ప్రశాంత్ వర్మ అనే కొత్తకుర్రాడు డైరక్ట్ చేసిన సినిమా ఇది. కాబట్టి పట్టించుకోవాల్సి అవసరం లేదు. కానీ “అ!” సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. దీని కథ ఏంటనేది ఇప్పటివరకు బయటకు రాకపోవడం ఓ స్పెషాలిటీ అయితే, ఈ కథ నచ్చి హీరో నాని ఏకంగా నిర్మాతగా మారడం “అ!” సినిమాను లైమ్ లైట్లో నిలబెట్టింది

ఇక్కడితో “అ!” సంచలనాలు ఆగలేదు. ఈ కథ నచ్చి ఏకంగా స్టార్ హీరోయిన్ కాజల్ ఇందులో నటించడానికి ఒప్పుకుంది. కాజల్ తో పాటు నిత్యామీనన్, రెజీనా, ఇషా, అవసరాల శ్రీనివాస్ కూడా ఇందులో నటించారంటే కేవలం కథ నచ్చడం వల్లనే. అందుకే “అ!” సినిమాపై అందరి దృష్టిపడింది.

ఇక “అ!”తో పాటు వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా మనసుకు నచ్చింది. ఇందులో కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ కూతురు, మహేష్ అక్క మంజుల దర్శకురాలిగా మారి తీసిన సినిమా ఇది. సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. సందీప్ కిషన్, అమైరా దస్తర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మంజుల కూతురు, భర్త కూడా నటించారు.