సందీప్ కిషన్ ఇంటర్వ్యూ
Thursday,February 15,2018 - 05:08 by Z_CLU
మంజుల డైరెక్షన్ లో తెరకెక్కింది ‘మనసుకు నచ్చింది’ మూవీ. ఇంటెన్సివ్ లవ్ స్టోరీ తో పాటు లైఫ్ ని కంప్లీట్ గా బ్రతికేయాలి అనే ఆలోచన కలిగేలా సినిమా ఉండబోతుందని చెప్తున్న సందీప్ కిషన్, మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…
అదే నా క్యారెక్టర్…
సినిమాలో నా క్యారెక్టర్ బేసిగ్గా చాలా మంచోడు. కానీ దేన్నీ సీరియస్ గా తీసుకోడు… ఇంగ్లీష్ మూవీస్… ఇంగ్లీష్ సిరీస్ చూస్తుంటాడు. కన్ఫ్యూజ్డ్ ఇడియట్ ఒక రకంగా చెప్పాలంటే….
మనసుకు నచ్చింది సినిమా…
కొన్ని సినిమాల్ని కథలు నడిపిస్తాయి. కొన్ని సినిమాల్ని క్యారెక్టర్స్ ముందుకు తీసుకు వెళ్తాయి. కానీ ఈ సినిమాని మూమెంట్స్ డ్రైవ్ చేస్తాయి.

ఇదీ అలాంటి సినిమానే…
సినిమా ట్రైలర్ చూసి కొంతమంది ‘నువ్వే కావాలి’ సినిమాలా ఉంటుందా అని అడిగారు. ఆఫ్ కోర్స్ సినిమా కథ అలాంటిదే కానీ, ఈ సినిమాలో సిచ్యువేషన్స్ వేరు.. ఇమోషన్స్ వేరు… ఇది అందరూ చూడదగ్గ సినిమా అవుతుంది….
ఆ క్రెడిట్ మంజుల గారికే….
సినిమా విషయంలో స్క్రిప్ట్ స్టేజ్ లో ఏదైతే అనుకుంటామో అది కొన్నిసార్లు సరిగ్గా అలాగే ఎగ్జిక్యూట్ చేయడం కుదరకపోవచ్చు. కానీ మంజుల గారు ఏదైతే మాకు చెప్పారో, ఆవిడ ఏది అనుకున్నారో సరిగ్గా అలాగే తెరకెక్కించారు. ఆ క్రెడిట్ ఆవిడకే దక్కుతుంది.
ఫస్ట్ టైమ్ చేశాను…
నేను ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. కొంచెం మాస్, పక్కింటి అబ్బాయిలా కనబడే క్యారెక్టర్స్ చేశాను కానీ ఈ సినిమాలో కొంచెం క్లాస్ గా కనిపిస్తాను. లుక్ కూడా కొంచెం డిఫెరెంట్ గా ట్రై చేశాను…
పవర్ ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్స్….
మనసుకు నచ్చింది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి ఈ సినిమా చాలా నచ్చేస్తుంది. మంజుల గారు కొన్ని ఇమోషనల్ సీన్స్ ని అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు.
ఏజ్ కి తగ్గ సినిమాలు…
నా ఏజ్ కి తగ్గ సినిమాలు చేయాలి. రొమాంటిక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్స్ చేయాలనుకుంటున్నా… కమర్షియల్ ఎంటర్ టైనర్స్ చేస్తూ, మధ్య మధ్యలో డిఫెరెంట్ మూవీస్ చేస్తా…

అలా జరిగింది…
ఈ సినిమాకి జెమినీ కిరణ్ గారు నన్ను సజెస్ట్ చేశారు. మంజుల గారు నన్ను కలిసినప్పుడు నేను కంప్లీట్ గా నక్షత్రం లుక్ లో ఉన్నా.. గెడ్డంతో కంప్లీట్ గా ట్యాన్ అయిపోయి ఉన్నాను.. అప్పుడు న్యారేట్ చేశారు నాకు ఈ స్టోరీని. నక్షత్రం లో నా క్యారెక్టర్ కి ఈ సినిమాలో క్యారెక్టర్ కి చాలా తేడా ఉంటుంది.
అదే సినిమా కాన్సెప్ట్….
సినిమాలో లవ్ స్టోరీతో పాటు నేచర్ ఉంటుంది. అసలు మనం మన లైఫ్ ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నాం. సన్ సెట్, సన్ రైజ్ ని చూసి ఎన్ని రోజులవుతుంది..” ఈ సినిమాతో మనల్ని మనం కలుసుకునే ప్రయత్నం చేస్తాం. అదే ఈ సినిమా కాన్సెప్ట్…
కునాల్ కోహ్లీ మూవీ…
చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. డబ్బింగ్ కూడా బిగిన్ అయింది… మ్యాగ్జిమం సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం…
నెక్స్ట్ మూవీస్…
నందిని పులి అని కొత్త డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాను. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఇంకో సినిమా ఓకె చేశాను. వన్ మంత్ గ్యాప్ తీసుకుని ఈ మూవీ బిగిన్ చేస్తాను… తమిళ్ లో నేను, అరవింద్ స్వామి కలిసి చేసిన సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఫ్యూచర్ ఫిలిమ్స్…
నెక్స్ట్ మూవీస్ జెన్యూన్ గా ఫన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నా….