ముగ్గురిని లైన్ లో పెట్టాడు...

Saturday,February 25,2017 - 06:49 by Z_CLU

నాచురల్ స్టార్ నాని జెట్ స్పీడ్ తో దూసుకెళ్లాలని డిసైడ్ అయిపోయాడు. లేటెస్ట్ గా ‘నేను లోకల్’ తో కెరీర్ లోఅత్యధిక కలెక్షన్స్ సాధించి గ్రాండ్ హిట్ అందుకున్న నాని ప్రెజెంట్ శివ అనే దర్శకుడితో ఓ సినిమాను సెట్స్ పై పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జరుగుతుండగానే మరో ముగ్గురు డైరెక్టర్స్ ను కూడా  లైన్ లో పెట్టేశాడు..

ప్రెజెంట్ దానయ్య బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా తర్వాత  మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో నెక్స్ట్ సినిమా  చేయడానికి రెడీ అవుతున్న నాని మరో వైపు హను రాఘవ పూడితో మరో సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే సినిమా తర్వాత హను తో సెట్ పైకి వెళ్ళబోతున్న నాని మరో వైపు మేర్ల పాక గాంధీ చెప్పిన కథ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం… అంటే ప్రెజెంట్ నాని ఖాతాలో  ఓ ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారన్నమాట….