నాగశౌర్య సినిమా కూడా ఈ నెలలోనే

Thursday,September 03,2020 - 04:27 by Z_CLU

యంగ్ హీరో నాగశౌర్య కూడా సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొత్త సినిమాను ఈ నెల నుంచే స్టార్ట్ చేయబోతున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌
ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది.

ప్ర‌భుత్వ నిబంధనల ప్ర‌కారం అన్ని జాగ్ర‌త‌లు తీసుకుంటూ సెప్టెంబ‌ర్ 18 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి నాన్ స్టాప్ గా కొనసాగించనున్నారు.

సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్ లో Nagashourya నిల్చొని ఉన్న స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ‌శౌర్య విలుకాడుగా (Archer) క‌నిపించ‌నున్నారు.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నారు. సినిమాలో శౌర్య సరసన కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీత దర్శకుడు.