Naga Shaurya - మరో సినిమా!

Friday,October 16,2020 - 01:29 by Z_CLU

ప్రస్తుత సౌజన్య దర్శకత్వంలో ఒక సినిమా సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్న యంగ్ హీరో Naga Shaurya తాజాగా మరో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు. అనీష్ కృష్ణ డైరెక్షన్ లో త్వరలోనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు.

అనీష్ గతంలో ‘అలా ఎలా’ , ‘లవర్స్’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సొంత బ్యానర్ Ira Creations లో చేయబోతున్నాడు శౌర్య.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఉష ముల్పూరి నిర్మించిన ఈ సినిమాకు Sagar Mahathi మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు

Also Read – నాగశౌర్య సెట్స్ పైకొచ్చాడు