ZeeCinemalu - సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు

Friday,September 04,2020 - 08:25 by Z_CLU

నాలుగేళ్ల ప్రయాణం.. తిరుగులేని ప్రస్థానం
బుడి బుడి అడుగులతో ప్రారంభమైన జీ సినిమాలు.. విజయవంతంగా నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 2016లో సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబర్ 4) గ్రాండ్ గా ప్రారంభమైన జీ సినిమాలు ఛానెల్.. ఈ నాలుగేళ్లలో అన్-లిమిటెడ్ వినోదాన్ని అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైంది..

ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో.. రాబోయే రోజుల్లో, మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉంది మీ జీ సినిమాలు.

ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ZeeCinemalu సాధించిన విజయాలు ఎన్నో. దిల్ పై సూపర్ హిట్ అంటూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జీ సినిమాలు.. లాంఛ్ అయిన కొద్దిరోజులకే తన సత్తా ఏంటో చూపించింది. విలక్షణ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్స్ తో దూసుకుపోయింది జీ సినిమాలు. ప్లజెంట్ లుక్, కూల్ మూవీస్ తో ఒకసారి ఛానెల్ కు ట్యూన్ అయిన ప్రేక్షకుడు, ఛానెల్ తిప్పడానికి ఇష్టపడని విధంగా ముస్తాబైంది మన జీ సినిమాలు.

ఏ టైమ్ లో ఎలాంటి మూవీ అందించాలో జీ సినిమాలు ఛానెల్ కు బాగా తెలుసు. యాక్షన్, హారర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఎన్నో జానర్లకు చెందిన సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ అందించి, ఆడియన్స్ కు నాన్-స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది జీ సినిమాలు.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, 7 డేస్ 7 ప్రీమియర్స్ లాంటి విప్లవాత్మక మార్పులతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది జీ సినిమాలు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ లో భాగంగా కథా బలం ఉన్న సినిమాల్ని ప్రీమియర్ మూవీస్ గా ప్రసారం చేసి హిట్ కొట్టడం జీ సినిమాలు స్టయిల్. సౌత్ మూవీ ఛానెల్స్ లో ఈ సెగ్మెంట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఛానెల్ ఇదే. ఇప్పటికీ ఛానెల్ core USP ఇదే.

ఇందులో భాగంగా.. శివగంగ, ఇది మా ప్రేమకథ, మాతంగి, కుక్కలున్నాయి జాగ్రత్త, కుమారి 21ఎఫ్, అఖిల్ లాంటి సినిమాలు జీ సినిమాలు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా ప్రసారమయ్యాయి. ప్రేక్షకుల ఆదరణతో హయ్యస్ట్ రేటింగ్స్ సాధించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నచిన్న కాంటెస్ట్ లు, సరదా పోటీలు ఆడియన్స్ ను కంప్లీట్ గా ఎంగేజ్ చేయడమే కాకుండా, ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాయి కూడా. ఇక 7 డేస్ 7 ప్రీమియర్స్ లో భాగంగా రోజుకో బ్లాక్ బస్టర్ మూవీ చూసి ఎంజాయ్ చేశారు ఆడియన్స్.

కేవలం ఇవే కాకుండా.. శాటర్ డే మెగా మూవీ, ఫ్రైడే బ్లాక్ బస్టర్స్, 9 డేస్ 9 బ్లాక్ బస్టర్స్, మెగా మూవీ ఆఫ్ ది వీక్, ఫ్యామిలీ మూవీ టైమ్ లాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది జీ సినిమాలు.

కేవలం తెలుగు సినిమాలకే ఫిక్స్ అయిపోలేదు జీ సినిమాలు. బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ ను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అందిస్తోంది. బాలీవుడ్ లో హిట్ అయిన చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలతో పాటు… మంకీ కింగ్, TheBFG లాంటి హాలీవుడ్ మూవీస్ ను అందిస్తోంది. షారూక్, హృతిక్, సల్మాన్ లాంటి సూపర్ స్టార్లు నటించిన హిట్ సినిమాల్ని జీ సినిమాలు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. వీటితో పాటు హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ నటించిన సూపర్ హిట్ మూవీస్, స్పైడర్ మేన్ సిరీస్ జీ సినిమాలు సొంతం.

ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో, ప్రీమియర్ మూవీస్ తో ప్రేక్షకులకు నిత్యనూతన అనుభవాన్ని, అన్-లిమిటెడ్ వినోదాన్ని అందిస్తూ.. సక్సెస్ ఫుల్ గా 4 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది మీ ZeeCinemalu.అంతే కాదు.. మరికొన్ని రోజుల్లో రాబోతున్న దసరా ఫెస్టివల్ కోసం కూడా సరికొత్త మూవీస్ లైనప్ రెడీ చేసింది. ఈ దసరాకు జీ సినిమాలు ఛానెల్ లో మరిన్ని సర్ ప్రైజెస్ చూడొచ్చు.

ఆడియన్స్ ఆదరాభిమానాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ..
ZeeCinemalu – దిల్ పై సూపర్ హిట్