డిసెంబర్ నుండి శౌర్య కొత్త సినిమా!

Thursday,October 29,2020 - 12:38 by Z_CLU

ప్రస్తుతం NagaShourya రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సౌజన్య దర్శకత్వంలో Sithara Entertainments బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న శౌర్య, మరోవైపు సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇంకో సినిమాను ప్రారంభించి డిసెంబర్ నుండి ఆ ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ పైకి తీసుకురానున్నాడు.

NagaShourya Aneesh Krishna Movie opening

“అలా ఎలా” మూవీ ఫేం అనిష్ కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్ Ira Creations లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నాడు శౌర్య. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో నిన్న ప్రారంభించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి.

Also Read – నాగశౌర్య-రీతూవర్మ మూవీ డీటెయిల్స్