Hero Nani - షూటింగ్ కి రెడీ

Thursday,September 03,2020 - 03:50 by Z_CLU

కొన్ని నెలలుగా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమైన Natural Star ఎట్టకేలకు మళ్ళీ సెట్ పైకి రాబోతున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో Nani నటిస్తున్న Tuck Jagadish సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతునట్లు ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు నాని.

‘టక్ జగదీశ్’ కి సంబంధించి ఇప్పటికే 40 శాతం షూట్ పూర్తయింది. వచ్చే నెల నుండి షెడ్యుల్ మొదలు పెట్టి మిగిలిన భాగాన్ని వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు Thaman మ్యూజిక్ అందిస్తున్నాడు. నాని సరసన Ritu Varma, Ishwarya Rajesh హీరోయిన్స్ గా నటిస్తున్నారు.