Nagarjuna Bangarraju - డివోషనల్ యాంగిల్ కూడా!

Saturday,January 08,2022 - 04:19 by Z_CLU

Nagarjuna’s Bangarraju has devotional connect

కొన్ని సినిమాలకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక శక్తి ఉంటూ ముందుకు నడిపిస్తుంటుంది. ఈమధ్య రిలీజైన అఖండలో అదే జరిగింది. సరిగ్గా అలాంటి సూపర్ పవర్ ఇప్పుడు ‘బంగార్రాజు’ కి ఉందంటున్నారు కింగ్ నాగార్జున. సినిమాలో శివుడి గుడిని చూపిస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవి టీజర్ లో కూడా హైలైట్ చేశారు. ఆ షాట్స్ కి “లయకారుడి సన్నిధిలో అపశ్రుతి కలి మాయ కాకపోదు.” అంటూ నాగబాబు యముడి గెటప్ లో చెప్పే వాయిస్ ఓవర్ కూడా టీజర్ లో పెట్టారు.

ఇక తాజాగా సినిమాకు సంబంధించి మొదటి ప్రెస్ మీట్ లో కూడా నాగ్ అదే చెప్పారు. ఈ సినిమాలో శివుడు ఉన్నాడు. ఆయన ఆజ్ఞతోనే సినిమా అనుకున్న టైంలో రిలీజ్ అవుతుందన్నట్టుగా చెప్పారు. నిజానికి ‘బంగార్రాజు’లో కామెడీ , లవ్, రొమాన్స్, మంచి సాంగ్స్, అదిరిపోయే యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు డివోషనల్ ఎలిమెంట్ కూడా యాడ్ అవ్వనుంది.

క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా శివుడి గుడిలోనే ఉండనుంది. గుడిలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా పెట్టారు. సో నాగార్జున -నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని అన్ని విధాలుగా మెప్పించే కంటెంట్ ఉందన్నమాట.

మరి సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించడం ఖాయం అనిపిస్తుంది. మరి తండ్రి కొడుకులు ఈ సినిమాతో ఎంత కలెక్ట్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేస్తారో చూడాలి.