KGF Chapter 2 - మరోసారి క్లారిటీ ఇచ్చారు

Saturday,January 08,2022 - 02:47 by Z_CLU

KGF Chapter 2 – No change of date for release

ఈ ఏడాది మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా మూవీస్ లిస్టు చూస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది ‘KGF Chapter2’. ఈ సినిమా కోసం కన్నడ , తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యష్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ‘KGF’ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. తాజాగా యష్ బర్త్ డే పోస్టర్ తో మరోసారి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్లే అదే డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. నిజానికి RRR, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ తర్వాత KGF 2 కూడా వాయిదా పడనుందని అనుకున్నారు. కానీ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. అప్పటి వరకూ కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి అదే డేట్ కి స్టిక్ అయి ఉన్నారు మేకర్స్.

kgf2

ఫిబ్రవరి లేదా మార్చ్ నుండి భారీ ప్రమోషన్స్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నారు. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవీన టండన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ట్రేడ్ పరంగా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో వారాహి సంస్థ ద్వారానే రిలీజ్ అవ్వనుంది.