Bangarraju Collections - మొదటిరోజు దుమ్ముదులిపిన అక్కినేని హీరోలు

Saturday,January 15,2022 - 03:43 by Z_CLU

Nagarjuna’s Bangarraju Day 1 Collections

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా, సంక్రాంతి కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లలో దుమ్ముదులిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 17 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఓవర్సీస్ లో ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నప్పటికీ బంగార్రాజు వసూళ్లపై ఈ ప్రభావం పడకపోవడం ఆశ్చర్యం. పండగ సందర్భంగా పండగ లాంటి సినిమాకు ఆడియన్స్ క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ప్రభావం బంగార్రాజుపై పడలేదు. అంచనాలను మించి మొదటి రోజు వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల గ్రాస్ (రూ. 8.11 కోట్లు షేర్) వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 2.03 కోట్లు
సీడెడ్ – రూ. 1.74 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.24 కోట్లు
ఈస్ట్ – 76 లక్షలు
వెస్ట్ – 65 లక్షలు
గుంటూరు – 89 లక్షలు
నెల్లూరు – 34 లక్షలు
కృష్ణా – 46 లక్షలు

bangarraju collections