Nagarjuna’s Bangarraju Day 1 Collections

Saturday,January 15,2022 - 03:43 by Z_CLU

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా, సంక్రాంతి కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లలో దుమ్ముదులిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 17 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఓవర్సీస్ లో ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నప్పటికీ బంగార్రాజు వసూళ్లపై ఈ ప్రభావం పడకపోవడం ఆశ్చర్యం. పండగ సందర్భంగా పండగ లాంటి సినిమాకు ఆడియన్స్ క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ప్రభావం బంగార్రాజుపై పడలేదు. అంచనాలను మించి మొదటి రోజు వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల గ్రాస్ (రూ. 8.11 కోట్లు షేర్) వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్ నైజాం - రూ. 2.03 కోట్లు సీడెడ్ - రూ. 1.74 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 1.24 కోట్లు ఈస్ట్ - 76 లక్షలు వెస్ట్ - 65 లక్షలు గుంటూరు - 89 లక్షలు నెల్లూరు - 34 లక్షలు కృష్ణా - 46 లక్షలు

bangarraju collections