NagaChaitanya Speech at Bangarraju Success Meet
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు నాగచైతన్య. లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు బంగార్రాజుతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేసిన చైతన్య.. బంగార్రాజు సక్సెస్ ను తండ్రి నాగార్జునకు అంకితం చేశాడు.

– చాలా కాల్స్ వస్తున్నాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయని చెబుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 30 నిమిషాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజంగా ఇది నేను ఊహించలేదు. ఈ సినిమాపై నాన్న చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మొదటి రోజు నుంచి అదే ఎనర్జీతో పనిచేశారు. మాకు అదే ఎనర్జీ అందించారు. ఈ సినిమా సక్సెస్ ను నాన్నకు డెడికేట్ చేస్తున్నాను.
– మొదటి రోజు కల్యాణ్ కృష్ణ నాకు ఏది చెప్పాడో, అంతకంటే బాగా సినిమా తీశాడు. నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. సినిమా చూసినా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. మాకు నిజంగా సంక్రాంతి తీసుకొచ్చారు. ఇప్పటివరకు సినిమా చూడని వాళ్లు తప్పకుండా ఈ సినిమా థియేటర్లలో చూడండి.

– పాత్ర చేయడానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చాలా సపోర్ట్ చేశాడు. `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమాతో ఆయన నన్ను ప్రేక్షకులకు దగ్గర చేశాడు. బంగార్రాజుతో మరింత దగ్గరకు వెళ్ళేలా చేశాడు. కథ విన్నాక ఆయన చెప్పినట్లు చేయడమే. ఆయనకు అందరి పల్స్ బాగా తెలుసు. ఇక షూటింగ్‌లో నాన్నగారు నన్ను డామినేట్ చేశారనే ఫీలింగ్ ఓసారి కలిగింది. అది ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాను. కాస్త జలసీ అనిపించినా ఆరోగ్యకరమైన వాతావరణంలో నన్న నడిపించింది అని తెలిపారు.