నాగచైతన్య మూవీలో భారీ స్టార్ కాస్ట్

Saturday,October 15,2022 - 02:58 by Z_CLU

Aravind Swami and Priyamani in Nagachaitanya’s Movie

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ఈమధ్యే సెట్స్ పైకి వచ్చింది. నాగచైతన్య కెరీర్ లో 22వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్. నాగచైనత్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది.

ఇప్పుడీ మూవీ కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. నాగచైతన్య తర్వాత ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నది వీళ్లే. కోలీవుడ్ కు చెందిన ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కూడా తారాగణంలో చేరారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండడం మరో విశేషం.

బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ ఖతీర్ ఈ చిత్రానికి కెమరామెన్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు.